ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ పోలీస్ రాజ్యంగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా భావవ్యక్తీకరణను హరించే విధంగా.. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసేలా ఈ సెక్షన్లు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: అత్యాచార, సైబర్ క్రైమ్ బాధితులకు వెంటనే న్యాయం జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొని రావాలని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. అధికార, ప్రతిపక్షాలు అయినప్పటికీ కొన్ని విషయాల్లో కలిసి పని చేయాలని ఆయన సూచించారు. అత్యాచారం చేసిన వారికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
త్వరగా న్యాయం జరుగుతుందని బాధితుల్లో కూడా భరోసా ఇవ్వాలని సూచించారు. ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే అంత అన్యాయం జరిగినట్లు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని.. ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటును చేయాలని అన్నారు.
అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ పోలీస్ రాజ్యంగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా భావవ్యక్తీకరణను హరించే విధంగా.. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసేలా ఈ సెక్షన్లు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఏం చేసినా సరే తప్పుగా మారే విధంగా ఆ రూల్స్ ఉన్నాయని అన్నారు. ప్రజలు తమ భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారని.. అలంటి సమయంలో ఈ కొత్త చట్టాల కారణంగా ప్రజల స్వేచ్ఛను హరించినట్లు ఉందని అన్నారు.