ఉన్న అందరికీ రుణమాఫీ చేయాలంటే.. రూ.49 వేల కోట్లకు పైగా అవసరం పడుతుందని తెలిపారు. కేవలం రూ.17వేల కోట్లతో రుణమాఫీ చేసి,
మొత్తం రైతులకు రుణ మాఫీ చేశామని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీ అనేదాని ద్వారా కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోవడంపై స్పందించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న దేవుళ్లపై ఒట్లు వేసి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆయన అన్నారు. తెలంగాణలో మొత్తం 60 లక్షల మంది రైతులు ఉన్నారని ఆయన అన్నారు. ఉన్న అందరికీ రుణమాఫీ చేయాలంటే.. రూ.49 వేల కోట్లకు పైగా అవసరం పడుతుందని తెలిపారు. కేవలం రూ.17వేల కోట్లతో రుణమాఫీ చేసి, మొత్తం రైతులకు రుణ మాఫీ చేశామని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
ఏ రోజు వరంగల్‌లో సభ పెడతారో చెప్పండి. ఆ సభలో రుణమాఫీ చేయని రైతుల సభ ఎలా నిండుతుంది? అని ఆయన ప్రశ్నించారు. రుణ మాఫీ అయిన అర్హుల జాబితాను బయట పెట్టాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారని ఆయన తెలిపారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు? ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చేయలేదు కాబట్టి రేవంత్ కట్టుకథలు ఆడుతూ ఎమ్మెల్యేల ఆఫీస్‌ల మీద దాడులు చేయిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.