తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. తెలంగాణలో పలు చోట్ల రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సిద్దిపేట,యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.