ప్రధాని నరేంధ్రమోదీ పుట్టిన రోజు సంధర్బంగా ఆయనకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఆ గిఫ్ట్స్ కు చాలా కాస్ట్లీ టాప్ 5 వస్తువులివే.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రధాని నరేంధ్రమోదీ పుట్టిన రోజు సంధర్బంగా ఆయనకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఆ గిఫ్ట్స్ కు చాలా కాస్ట్లీ టాప్ 5 వస్తువులివే. గత పదేళ్ల పాలనను చూసి కొందరు..ప్రజాసంక్షేమం కోసం , దేశ అభివృధ్ధి చూసి మరికొందరు 370 ఆర్టికల్ రద్దు ఇలా చాలా సంధర్బాల్లో వచ్చి గిఫ్ట్స్ అన్నింటిని వేలం వేస్తున్నారు. మీరు కూడా ఆ వస్తువులను పొందవచ్చు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సెప్టెంబర్ 17న 74వ పుట్టినరోజు జరుపుకున్నారు. యావత్ దేశం ఆయన పుట్టినరోజును జరుపుకుంటే మోదీ మాత్రం రోజూ లాగే పాలనా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఈ సారి మోదీ బర్త్ డే సంధర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులు వేలం పాట ప్రారంభించింది.
ఈ ఏడాది మోదీకి వచ్చిన దాదాపు 600 పైగా వస్తువులను వేలంపాటలో వుంచింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో వేలల్లో , లక్షల్లో ఉండే గిఫ్ట్స్ పాటు కోట్ల రూపాయిల బహుమతులు కూడా ఉన్నాయి.మోదీ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 17,2024 న వస్తువుల ఈ-వేలంపాట ప్రారంభమైంది. అక్టోబర్ 2 వతారీఖు వరకు ఈ వేలం పాట జరుగుతుంది. వీటిలో పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ ల షూస్, క్యాప్ తో పాటు ఆద్యాత్మిక అయోద్య రామమందిర నమూనా జ్ఞాపిక కూడా వుంది.
వేలంపాటలో వున్న వస్తువుల కోసం https://pmmementos.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ సైట్ తో లాగిన్ అయ్యి ...మీ నెంబర్ తో పాస్ వర్డ్ జనరేట్ చేసుకుంటే ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఆక్షన్ లో మీరుంటారు.
2019 లో మోదీకి వస్తువులు వేలం వేయడం మొదలుపెట్టారు. జరిగిన ఐదు ఎడిషన్స్ ఈ-వేలం ద్వారా రూ.50 కోట్లు సమకూరినట్లు తెలుస్తోంది. ఈ నిధులను గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన 'నమామి గంగే' కార్యక్రమానికి ఉపయోగించనున్నారు. ఇప్పుడు ఈ ఆక్షన్ ద్వారా మరో కోటి నుంచి రెండు కోట్లు వచ్చే అవకాశం ఉంది.