Mokshagna:తమ్ముడి సినిమాకు క్లాప్ కొట్టనున్న jr:ఎన్టీఆర్..!

ఈ మధ్యకాలంలో  నందమూరి ఫ్యామిలీ నుంచి మూడవ తరం నుంచి హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ  సినిమా ఎంట్రీ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఇండస్ట్రీలోకి


Published Aug 15, 2024 12:59:00 PM
postImages/2024-08-15/1723704302_mokshagna.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో  నందమూరి ఫ్యామిలీ నుంచి మూడవ తరం నుంచి హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ  సినిమా ఎంట్రీ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని గత రెండు సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలోనే ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్చుకొని హీరోగా మంచి లుక్ లోకి వచ్చారు. దీంతో ఈయన సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందని అనేక వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ చిత్రానికి  తన అన్నయ్య ఎన్టీఆర్  క్లాప్ కొట్టి ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఏంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో వార్త మాత్రం హల్చల్ చేస్తోంది.  అయితే గత కొంతకాలంగా బాలకృష్ణతో ఎన్టీఆర్ కు గ్యాప్ ఉందనే ప్రచారం  సాగింది. ఒకవేళ మోక్షజ్ఞ సినిమాకి ఎన్టీఆర్ క్లాప్ కొడితే మాత్రం ఈ గ్యాప్ పూర్తిగా లేదనే విషయం తేటతెల్లమవుతుంది. మరి చూడాలి నిజంగానే మోక్షజ్ఞ సినిమాను  ఎన్టీఆర్ క్లాప్ కొట్టి ప్రారంభించి తమ్ముడికి వెల్కమ్ చెబుతారా లేదంటే  ఇంతకుముందు లాగే సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మోక్షజ్ఞ చేసే సినిమాలో  హీరోయిన్ గా శ్రీ లీలాను తీసుకుంటారని  వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన మొదటిసారి చేసే సినిమా స్టోరీ తప్పక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, అలాంటి స్టోరీ కోసమే బాలకృష్ణ దర్శకనిర్మాతలతో అనేక కసరత్తులు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇవన్నీ ఓకే అయి సినిమా సెట్స్ పైకి వస్తే మాత్రం  నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr sr-ntr balakrishna mokshagna

Related Articles