Nag Ashwin : ‘కల్కి 2’ కి డైరక్టర్లు కావలెను ?

తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు.


Published Aug 12, 2024 05:41:00 PM
postImages/2024-08-12/1723464757_nagashwinkalki3321708926684.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏంటి ...ప్రభాస్ సినిమాకు డైరక్టర్లు కావాలా..ఇంతకీ నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నట్లు అంటారేమో.. ప్రభాస్ తో కల్కి సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు నాగ్ అశ్విన్. ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఈ సినిమా మంచి విజయం సాధించింది. పార్ట్ 2కి కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది  షూటింగ్ మొదలవుతుంది. 2025 లోనే రిలీజ్ కూడా చేస్తామని నిర్మాత అశ్వినీ దత్ కూడా చెప్పారు.


తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో డైరక్షన్ పై ఇంట్రస్ట్ ఉన్నవాళ్లంతా తెగ అప్లికేషన్స్ వేస్తున్నారట.


అయితే ఇది నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసే కొత్త సినిమాకేనా? లేకపోతే నిర్మాతగా నాగ్ అశ్విన్ AVM స్టూడియోస్ తో కలిసి సినిమా చేస్తున్నాడా అనేది నాగ్ కాని సంస్థ కాని క్లారిటీ ఇవ్వలేదు. ఈ పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ కల్కి 2 వదిలేసి కొత్త సినిమా చేస్తున్నాడేమో అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి అశ్విన్ ఎప్పుడు రెస్పాండ్డ అవుతాడో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu nag-ashwin

Related Articles