ఈ అమ్మవారికి చామంతులతో పూజలు చేస్తే ఇష్టం.త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరీ నామంతో పిలుస్తారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవీ గా భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. ఈ అమ్మవారికి చామంతులతో పూజలు చేస్తే ఇష్టం.త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరీ నామంతో పిలుస్తారు.
పంచదశాక్షరి మహామంత్రానికి అధిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు. అయితే అమ్మకు పసుపు వర్ణం ప్రీతి.
"సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా" అంటూ అమ్మవారిని సేవిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. నాలుగో రోజు ఇంట్లో లలితా సహస్ర నామావళి చదివితే చాలా మంచిది.
ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కూరగాయలతో తయారు చేసిన కదంబ ప్రసాదంను సమర్పించాలి. ఈ ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టం. అయితే బంగారు వర్ణం కాని చామంతులు కాని అమ్మకు ప్రీతి. ఎవరైతే తమను తాము దుర్గామాత గా భావించుకొని పూజలు చేస్తారో వారికి నవరాత్రుల ఫలితాలు తప్పక లభిస్తాయి.