Jr NTR బావమరిది నితిన్ 'ఆయ్' ట్రైలర్ లాంచ్..!

తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి ఆదరాభిమానాలు పొందారో మనందరికీ తెలుసు. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.  అలాంటి జూనియర్ ఎన్టీఆర్ బావమరిది కూడా


Published Aug 05, 2024 04:40:34 PM
postImages/2024-08-05/1722856234_aaytrailer.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి ఆదరాభిమానాలు పొందారో మనందరికీ తెలుసు. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.  అలాంటి జూనియర్ ఎన్టీఆర్ బావమరిది కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆయన ఇప్పటికీ ఒక సినిమాలో నటించి  పర్లేదు అనిపించుకున్నారు.

ప్రస్తుతం ఆయన రెండో సినిమా కూడా  ఆగస్టు 15వ తేదీన మన ముందుకు రాబోతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్  'మ్యాడ్' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలాంటి ఈయన హీరోగా రెండవ సినిమా  'ఆయ్' కూడా త్వరలో థియేటర్లలోకి రాబోతోంది. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి  ట్రైలర్ రిలీజ్ అయింది.

 ఇంతకీ ఆ ట్రైలర్ ఎలా ఉందంటే.. అయితే ఈ మూవీ మొత్తం గోదావరి జిల్లాలోని పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తీసినట్టు కనిపిస్తోంది. ఒక పల్లెటూరులో ముగ్గురు కుర్రాళ్ళు అందులో హీరో ఒక్కడు. ఒక అమ్మాయితో ప్రేమలో పడి  ఆ ప్రేమ కోసం పడుతున్న ఇబ్బందుల గురించి స్టోరీ లైన్ ఉంటుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు అద్భుతమైన కామెడీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగానే కనిపిస్తోంది.

 అలాంటి ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అయ్యే టాప్ మోస్ట్ చిత్రాలను తట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్,  తంగలాన్ వంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంత పెద్ద చిత్రాలను తట్టుకొని నితిన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తోంది. అయితే ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. మొదటి సినిమా 'మ్యాడ్' తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ బావమరిది రెండవ సినిమాతో  ఇండస్ట్రీలో నిలబడతారా లేదా అనేది తెలుస్తుంది.

https://youtu.be/rkyVg2VRulc?si=bZDXAvLJ6BaQZ6jl

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr allu-aravindh narne-nithin aay-movie geeta-arts

Related Articles