Oppo: కిందపడ్డ పగలని ఫోన్..ధర కూడా తక్కువే.!

మార్కెట్ లో ఒప్పో మొబైల్ ఎంతటి ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు. ఈ కంపెనీ నుంచి ఎన్నో రకాల వేరియంట్లు వచ్చి మనల్ని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒప్పో కంపెనీ నుంచి సరికొత్త


Published Aug 22, 2024 01:59:00 PM
postImages/2024-08-22/1724313626_oppok12x.jpg

న్యూస్ లైన్ డెస్క్: మార్కెట్ లో ఒప్పో మొబైల్ ఎంతటి ఆదరణ పొందిందో మనందరికీ తెలుసు. ఈ కంపెనీ నుంచి ఎన్నో రకాల వేరియంట్లు వచ్చి మనల్ని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒప్పో కంపెనీ నుంచి సరికొత్త మొబైల్  రిలీజ్ అయింది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు చూద్దాం. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ కలిగిన ఫోన్ కావాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి వారికి ఒప్పో k12x 5gఅద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఫోను  మిలిటరీ గ్రేడ్ కలిగి ఉంది.  గత నెలలో మార్కెట్లోకి వచ్చిన ఈ మొబైల్ ప్రత్యేకమైన తగ్గింపుతో 12వేల తక్కువ ధరతో మనం కొనుగోలు చేయవచ్చు. మరి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు చూద్దాం..

ఈ మొబైల్  ip54 డస్ట్ వాటర్ రెసిస్టెంట్ బెనిఫిట్స్ కలిగి ఉన్నది. మొబైల్ టచ్ పై వాటర్ డ్రాప్స్ ఉన్నా కానీ, టచ్ అద్భుతంగా వర్క్ చేస్తుంది. 6gb ram, 128 జీబీ స్టోరేజ్  కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ను ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో 12,999 ధరలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే మాత్రం వెయ్యి రూపాయల డిస్కౌంట్ పొందుతారు. అలా ఈ మొబైల్ ను 11,999 మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే గరిష్టంగా  8,800 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును పొందవచ్చు.

అంటే మీ పాత ఫోన్ వర్కింగ్ ప్రాసెస్ ను బట్టి ఈ ధర ఉంటుంది. అలాగే ఈ మొబైల్ బ్రెజ్ మిడ్ నైట్, వైలెట్ కలర్స్ లో వస్తోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే  6.67  అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రష్ రేటు,  1000నిట్స్ పిక్ బ్రైట్ నెస్, మీడియా టెక్ డైమండ్ సిటీ 6300 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే  32 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా కలిగి ఉంది.  అంతేకాకుండా సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం 8mp ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే  5100mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటోంది. ఈ మొబైల్ కిందపడిన కానీ డ్యామేజ్ కాకుండా  బాడీని తయారు చేశారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu 5100mah-battery super-camera super-features oppok12x

Related Articles