BREAK UP: బ్రేకప్ అయిన ప్రతి కుర్రాడు చూడాల్సిన సినిమా !

ఒక క్రేజీ థ్రిల్లర్ ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉంది. కాస్త పాత సినిమా కాని ...చూస్తే థ్రిల్ అయిపోతారు. ప్రజెంట్ జనరేషన్ లవ్స్ అన్నీ ఇలానే ఉన్నాయని మాత్రం కనెక్ట్ అవుతారు.అప్పట్లో ఈ సినిమా భయంకరమైన హిట్టు. 


Published Jul 22, 2024 01:55:00 PM
postImages/2024-07-22/1721636866_97514533b3d0655eb43a07fdc9b93f08151a181d06fb512675b827db5960cc3b.SX1080FMjpg.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏ బాష లో అయినా సరే..థ్రిల్లర్ మూవీస్ మంచి ఫ్యాన్ బేస్ ఉంది . అలాంటిది రియాలిటీకి దగ్గరగా ఉండే థ్రిల్లర్స్ అయితే మరీ పడి చస్తారు. ఒక క్రేజీ థ్రిల్లర్ ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉంది. కాస్త పాత సినిమా కాని ...చూస్తే థ్రిల్ అయిపోతారు. ప్రజెంట్ జనరేషన్ లవ్స్ అన్నీ ఇలానే ఉన్నాయని మాత్రం కనెక్ట్ అవుతారు.అప్పట్లో ఈ సినిమా భయంకరమైన హిట్టు. 


సినిమా పేరు " ఒరిజినల్ సిన్ " ..యాంజిలీనా జోలీ హీరోయిన్.  ఆమె ఒక వ్యక్తి కి పరిచయమై ప్రేమిస్తుంది. అసలు మరో ప్రపంచం ఉందా అనేది తెలియనంత ప్రేమిస్తాడు. అప్పుడే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది.యాంజిలీనా జోలీ అతడిని ప్రేమించదు. ఆమె అందాన్ని, శరీరాన్ని, ప్రేమ అనే పదాన్ని ఎరగా వేసి అతడిని ముగ్గులోకి దించుతుంది. అతను దానిని ప్రేమ అనుకుంటాడు. కానీ, ఆమె మాత్రం తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి అతని సర్వస్వం లాగేసుకుంటుంది. 
అతని సంపద, కష్టార్జితం, అతని దగ్గర చిల్లిగవ్వ లేకుండా చేస్తుంది. అప్పటి వరకు ఒక మంచి ప్రేమకథ అనుకున్న సినిమా మోసంగా మారిపోతుంది. అలా అని అక్కడితో ఆగిపోకుండా రివేంజ్ స్టోరీగా దారి మళ్లుతుంది.

అతనిని వదిలి వెళ్లిపోయాక అతను యాంజిలీనా జోలీ పై పగ పెంచుకుంటాడు.ప్రాణాలు తీసేస్తే బాగున్ను అనుకుంటాడు, ఆమెకోసం వెతుకులాట మొదలు పెడతాడు. ఆమెను ఫేస్ చేస్తాడు కూడా. కానీ, ఆమె అందుకు సిద్ధంగానే ఉంటుంది. మరి.. తన పగ తీర్చుకున్నాడా? ఆమే అతనిపై విజయం సాధించిందా? ఏం జరిగిందో తెలియాలి అంటే మీరు ఈ “ఒరిజినల్ సిన్” అనే మూవీ చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ, మన దగ్గర చూడటానికి వీలులేదు. మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఈ మూవీ చూడచ్చు. అయితే కాస్త బో*ల్డ్ గా కూడా ఉంటుంది.  ఫ్యామిలీ తో కాని చూశారా...సింగిల్ టేక్ లో సిగ్గుపడిపోతారు. జాగ్రత్త .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news amazon-prime

Related Articles