Viral Video: ఇలాంటి అబ్బాయే కావాలి....రోడ్డు పై ప్లకార్డుతో యువతి.. వీడియో ఇదిగో!

ఓ అమ్మాయి అలానే ప్లకార్డుతో కనిపించింది. తను పెళ్లిచేసుకోబోయే అబ్బాయికి ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలంటూ మేడం గారు ప్లకార్డులో తెలిపారు.


Published Nov 25, 2024 01:27:00 PM
postImages/2024-11-25/1732521541_cr20241125tn67440ccb3f8a9.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గడ్డాలు గీసుకోని అబ్బాయిలు మాకొద్దు. రీసెంట్ గా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అమ్మాయిలు రోడెక్కి నిరసన ప్రదర్శనకు దిగారు. నో క్లీన్ షేవ్ ..నో లవ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది ఫుల్ వైరల్ అయ్యింది. అయితే ముంబై లోని తాజ్ హోటల్ ముందు ఓ అమ్మాయి అలానే ప్లకార్డుతో కనిపించింది. తను పెళ్లిచేసుకోబోయే అబ్బాయికి ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలంటూ మేడం గారు ప్లకార్డులో తెలిపారు.


సయాలీ సావంత్ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఇన్‌స్టాలో ఆమెకు 78 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘మ్యారేజ్ బయోడేటా’ అని ఆమె తన ప్లకార్డుపై రాసుకొచ్చింది. తనకు కావాల్సిన భర్త తన కంటే హైట్ ఉండాలని ముంబై కి చెందిన వాడే అవ్వాలని చెబుతూ ప్ల కార్డులు పట్టుకొని నిలుచుంది. ఈ వీడియోను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.


ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాబోయే భర్తకు ఈ లక్షణాలు ఉండాలన్న ఆమె ప్లకార్డు ప్రదర్శన వేలాదిమందిని ఆకర్షించింది. చాలామంది ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరీ ఇలా నడిరోడ్డుపై ప్రదర్శన ఏంటంటూ ఇంకొందరు పెదవి విరిచారు. రీసెంట్ గా ఓ అమ్మాయి సేమ్ ఇదే ప్లేసులో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర బట్టలు విప్పి చిన్న టవల్ తిరిగింది. ఇఫ్పుడు ఈ అమ్మాయి...ఈ వీడియోలు చూసి జనాలు చిరాకుపడుతున్నారు. ఏంటి గోల అంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : reels viral-news wedding girls mumbai videos

Related Articles