Jails: తెలంగాణ జైళ్లు ఫుల్లు..

హైదరాబాద్‌, సైబరాబాద్‌లకు చెందిన రిమాండ్‌ ఖైదీలను ఇటీవల చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో రద్దీ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, 220 మంది ఉండాల్సిన సంగారెడ్డి జైల్లో 569 మంది ఖైదీలు ఉన్నారు.


Published Aug 20, 2024 12:01:11 PM
postImages/2024-08-20/1724135471_chanchalgudajail.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలోని జైళ్లలో ఖైదీలు ఎక్కువ కావడంతో రద్దీ మరింత పెరిగినట్టు తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు అధికంగా నమోదు కావడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రధాన జైళ్లలో కూడా  పరిమితికి మించి ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. 

రిమాండ్ ఖైదీల బదిలీ ప్రోటోకాల్‌లలో మార్పుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో 1250 మందిని ఉంచాల్సిన చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో   2,103 మంది ఖైదీలను ఉంచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌లకు చెందిన రిమాండ్‌ ఖైదీలను ఇటీవల చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీంతో రద్దీ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, 220 మంది ఉండాల్సిన సంగారెడ్డి జైల్లో 569 మంది ఖైదీలు ఉన్నారు.

అంతేకాకుండా, గతంలో మూసివేసిన VIP బ్యారక్‌ను తిరిగి తెరిచారు. దీంతో  ఖైదీలతో ములాఖత్ అవ్వడానికి కూడా ఇబ్బందిగా మారిందని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇక చేసేదేమీ లేక ములాఖత్ సమయాన్ని ప్రతిరోజూ రెండు గంటలు పెంచాల్సి వచ్చిందని జైలు అధికారులు తెలిపారు. 

కాగా, రాష్ట్రంలోని 4 సెంట్రల్ జైళ్లు, 7 జిల్లా జైళ్లు, 29 సబ్ జైళ్లు, 2 మహిళా జైళ్లు, 3 ఇతర జైళ్లలో కలిపి 7,392 మంది ఖైదీలు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవస్థలో 7,667 మంది ఖైదీలు ఉన్నారు, వీరిలో 4,791 మంది అండర్ ట్రయల్ ఖైదీలు, 2,023 మంది శిక్ష ఖైదీలు, 838 మంది రిమాండ్ ఖైదీలు మరియు 15 మంది ఇతరులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam jail

Related Articles