ఆలయంలో పాత్రలు , స్టవ్ , గ్యాస్ ఇలా దొరికినవన్నీ దోచేశాడు. పని అంతా అయిపోయిందని వెళ్లిపోతున్న టైంలో గ్రామస్థులు కొందరు చూసేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అతడొక దొంగ ఒక ఆలయాన్ని చోరీకి టార్గెట్ గా ఎంచుకున్నాడు.ప్లాన్ ప్రకారం తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకొని దొంగతనానికి వెళ్లాడు. ఆలయంలో పాత్రలు , స్టవ్ , గ్యాస్ ఇలా దొరికినవన్నీ దోచేశాడు. పని అంతా అయిపోయిందని వెళ్లిపోతున్న టైంలో గ్రామస్థులు కొందరు చూసేశారు. వెంటనే పట్టుకుందామని వెళ్లారట స్థానికులు ..దీంతో ఇద్దరి దొంగ ల్లో ఒకరు మాత్రమే పారిపోయారు. మరొకరికి అక్కడిక్కడే మూర్ఛ వచ్చింది.
అపస్మారక స్థితిలో ఉన్న అతడిని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులు అతడిని హాస్పిటల్కు తరలించారు. చికిత్స అనంతరం కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన అతడు మూర్ఛ రోగినని చెప్పాడు. దొంగతనం చేసిన తర్వాత మూర్ఛ వచ్చిందని తెలిపాడు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా చుచురా లో ఈ ఘటన జరిగింది.
ప్రస్తుతం ఆ దొంగ జైలులో ఉన్నాడు. అతడు మూర్ఛ రోగి అని దర్యాప్తులో తేలింది. అయితే ఇంత మంది ఒకే సారి వెంటపడే సరికి టెన్షన్ తో మూర్ఛ వచ్చిందని తెలిపారు. వాళ్లు పొరుగూరి వాళ్లమని ...ఇక్కడ ఇళ్లల్లో దొంగతనం చెయ్యాలని వచ్చామని ఇంతలో ఇలా జరిగిందని తెలిపారు.