ఒడిశా మీదుగా ఛత్తీస్ గఢ్ లోకి నక్స్ లైట్లు ప్రవేశిస్తున్నారనే పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఈ ఆపరేషన్ చేపట్టింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఛత్తీస్ గఢ్ లో కొంటాలోని భధ్రతా దళాలత జరిగిన ఎన్ కౌంటర్ లో దాదాపు 15 మంది మావోయిస్టులు చనిపోయారు. భెజ్జీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ కన్ఫర్మ్ చేశారు. సంఘటన జరిగిన ప్లేస్ నుంచి భధ్రతా దళాలు మూడు ఆటోమెటిక్ తుపాకులు సహా చాలా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా మీదుగా ఛత్తీస్ గఢ్ లోకి నక్స్ లైట్లు ప్రవేశిస్తున్నారనే పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఈ ఆపరేషన్ చేపట్టింది.
కాగా, ఎన్కౌంటర్ జరిగినట్లు బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ పి.సుందర్రాజ్ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. కాబట్టి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు వివరాలు తెలియజేయలేదు. గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-దంతెవాడ సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో 31 మంది మావోయిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ సమయంలో భధ్రతా దళాలు భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.