Pradeep Machiraju: పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌తో ..మరో సారి హీరో అవుతున్న యాంకర్ !

మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొదటి సినిమా 30 రోజుల ప్రేమకథ చిత్రంతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేశాడు ప్రదీప్‌. 


Published Oct 17, 2024 11:48:00 AM
postImages/2024-10-17/1729145935_pradeep.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బుల్లితెరపై యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రదీప్ మాచిరాజు. ఒకసారి హీరో గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అనుకున్నంతగా ఆశించలేదు. ఇఫ్పుడు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొదటి సినిమా 30 రోజుల ప్రేమకథ చిత్రంతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేశాడు ప్రదీప్‌. 


తన రెండో ప్రయత్నంగా మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ సినిమా కోసమే టీవీ షోలకు దూరంగా వుంటున్నాడు. సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం ద్వారా బబర్ధస్త్‌తో పాటు పలు కామెడీ షోలకు దర్శకత్వం వహించిన నితిన్‌, భరత్‌లు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చాలా రోజులుగా ప్రదీప్ బుల్లి తెర పై కనిపించలేదు. ఈ ఎఫెక్ట్ సినిమా పై ఉంటుందని వాళ్ల నమ్మకం. మంచి స్టోరీ ...ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నారు. 


పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన మొదటి చిత్రం టైటిల్‌ కూడా ఇదే కావడం విశేషం. ఇక   ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, మోషన్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు మేకర్స్.  ఈ మూవీ డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu anchor cinema-news

Related Articles