మోహన్ బాబు కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా అంటే పెదరాయుడే..రజినీ కాంత్ , మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో సినిమా ఎవర్ గ్రీన్ పిక్చర్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మోహన్ బాబు కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా అంటే పెదరాయుడే..రజినీ కాంత్ , మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో సినిమా ఎవర్ గ్రీన్ పిక్చర్. అయితే అందులో కామిడీ మాత్రం అధ్భుతంగా ఉంటుంది. 1995లో వచ్చిన ఈ మూవీ కలెక్షన్లను కొల్లగొట్టడమే కాదు, అప్పట్లో ఇండస్ట్రీ హిట్. 150 రోజులకు పైగా ఆడింది. 1994లో తమిళంలో వచ్చిన నాటమ్మాయికి రీమేక్. బ్రహ్మానందంతో కామెడీ ఫుల్ నడుస్తుంది.
ఇక అప్పట్లో ట్రెండ్ సెట్టార్‌గా నిలిచిన కోటీ మ్యూజిక్ అందించాడు. బావవి నువ్వు, భామను నేను.. అబ్బా దాని సోకు చూసి వచ్చా వచ్చా, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, డమ డమ గుండె ఢమరుకం మోగే సాంగ్స్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. బాబు మోహన్ క్యారక్టర్ చాలా కామెడీ పండించాడు . బాబు మోహన్ స్త్రీ లోలుడు. బ్రహ్మానందానికి తల్లి ఎవరో చెప్పకుండా పెంచుతుంటాడు. ఎవరు కనిపిస్తే వారిని మీ పిన్ని ...నీకు తల్లి వరుస అంటూ చెప్తుంటాడు.
చివరకు తండ్రికి చెప్పకుండా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయిని ఇంటికి తీసుకువస్తాడు. జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లే బ్రహ్మానందం వైఫ్ క్యారక్టర్ చేసింది. జబర్థస్త్‌లో చమ్మక్ చంద్ర టీంలో వర్క్ చేసింది సత్య శ్రీ.. ప్రజెంట్ బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తుంది. సత్య శ్రీ తల్లి కూడా పెదరాయుడు, ఆర్య 2, నరేష్ యముడికి మొగుడు, ఇష్క్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ విషయాన్ని సత్యశ్రీ నే డైరక్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.