నిల్వ పచ్చళ్ళతో ప్రమాదం ఏడాది పాటు నిల్వ ఉండేలా వాటిల్లో ఉప్పు కారం నూనెలను ఫుల్లుగా దట్టించి ప్రిపేర్ చేసి నిల్వ చేస్తారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చాలా మందికి కూరలు, నాన్ వెజ్ ల కంటే ఎక్కువ పచ్చళ్లు , పొడులు తింటూ ఉంటారు. అయితే పచ్చళ్లు తినకూడదని అందరికి తెలుసు.. బీపీ పెరుగుతుంది. ఎన్ని చెప్పినా ..మామిడి, ఉసిరి ,నిమ్మ ,టమాట, ఇలా రకరకాల పచ్చళ్ళు పేరు వింటేనే నోరు ఊరిపోతుంది. నిల్వ పచ్చళ్ళతో ప్రమాదం ఏడాది పాటు నిల్వ ఉండేలా వాటిల్లో ఉప్పు కారం నూనెలను ఫుల్లుగా దట్టించి ప్రిపేర్ చేసి నిల్వ చేస్తారు. కాని పోషకాలు మాత్రం సున్నా..దీని కారణంగా పోషకాలు లేని ఆహారం తినడం శరీరానికి హానికరం.
నిలువ పచ్చళ్ళు తింటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందులోను రోజు తినే వారికి దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేది. నిలువ పచ్చళ్ళు ఎక్కువగా తినేవారిలో కడుపులో మంట, ఎసిడిటీ సమస్య వస్తుందని చెబుతున్నారు. వెజ్ భోజనం తినే వారు, నాన్ వెజ్ భోజనం వారితో పోలిస్తే ఈ పచ్చళ్లు చాలా ప్రమాదకరమంటున్నారు.
ఊరగాయ పచ్చళ్ల వల్ల అవి కిడ్నీల పైన భారం ఇక బిపి, డయాబెటిస్ ఉన్నవాళ్లు పచ్చడి ఎంత తక్కువ తింటే అంత మంచిదని సూచిస్తున్నారు. పచ్చళ్ళు నిల్వ ఉండడానికి వాటిలో ఉప్పు ఎక్కువగా వేస్తారు. పచ్చళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల అవి బిపి, డయాబెటిస్ లను బాగా పెంచుతాయి.నూనె శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గుండె జబ్బులను కూడా పెంచుతుంది. నిలువ పచ్చళ్ళను తినడం తగ్గించి, శరీరానికి పోషకాలను ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. గుండె ఆరోగ్యం బాగుండాలంటే పచ్చళ్లకు దూరంగా ఉండాల్సిందే.