ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుని వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్ : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుని వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ నిరసనల్లో ఆందోళనకారులను చెదరగొట్టే సమయంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఏకంగా డిప్యూటీ కలెక్టర్ మీదే లాఠీచార్జ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన బిహార్ లోని పాట్నాలో చోటు చేసుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై నిరసన తెలుపుతూ భారీ ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. పాట్నాలోని డాక్ బంగ్లా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొని ముందుకు చొచ్చుకువచ్చారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్, లాఠీఛార్జ్ ప్రయోగం చేశారు. అయితే.. ఆ ఆందోళనలను పరిశీలించేందుకు పాట్నా జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీకాంత్ కుండ్లిక్ ఖండేకర్ కూడా సివిల్ డ్రెస్ లో వచ్చారు. అయితే.. ఆయనను ఆందోళకారుడిగా భావించిన పోలీసు డిప్యూటీ కలెక్టర్ మీద లాఠీఛార్జ్ చేశాడు. ఆ పక్కనే ఉన్న పోలీసులు ఉన్నతాధికారులు గమనించి వారించారు. డిప్యూటీ కలెక్టర్ మీద లాఠీఛార్జి చేసిన పోలీసును పక్కకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సదరు పోలీస్ డిప్యూటీ కలెక్టర్ కి క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
SDM was in civil dress, Bihar Police beat him thinking he was a protestor.
Tags : supremecourt bihar national latest-news news-updates