తన కంటే చిన్నవయస్సు వ్యక్తైన నిక్ జోనాస్ ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడ జన్మించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ అయ్యింది. తన కూతురుకు కూడా అకౌంట్ తెరిచి ...తన చిట్టి పొట్టి కూతురు సంతోషాలన్నీ ఆ అకౌంట్ లో షేర్ చేస్తుందట. ఈ భామ బాలీవుడ్ , టాలీవుడ్ ఏ ఇండస్ట్రీ లోను పరిచయం అక్కర్లేదు. అయితే తరువాత హాలీవుడ్ కి వెళ్లి అక్కడ స్థిరపడిపోయింది. తన కంటే చిన్నవయస్సు వ్యక్తైన నిక్ జోనాస్ ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడ జన్మించింది.
రీసెంట్ గా ముంబైలో ప్రియంక చోప్రా సోదరుడు సిద్ధార్థ చోప్రా ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు ఈ బ్యూటీ తన భర్త, కుమార్తె మాల్తీ మేరీ జోనాస్ తో కలిసి హాజరైంది. అలా ఇక్కడకు వచ్చిన సంధర్భంగా తన కూతురుకి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేసింది. తన బిడ్డ పేరుతో ఏర్పాటు చేసిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కూడా ప్రియాంక రివిల్ చేసింది.
@maltimarie పేరుతో ప్రియాంక చోప్రా అకౌంట్ ను ఓపెన్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను తన స్టోరీలో పంచుకుంది. ఇప్పటి వరకు మీడియాలో పాప ఫఏస్ ను రివీల్ చెయ్యలేదు. ఇక ప్రియాంక త్వరలో స్పై-థ్రిల్లర్ స్ట్రీమింగ్ షో ‘సిటాడెల్’ రెండవ భాగంలో ఈ బ్యూటీ కనిపించనుంది.