ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రఘు కుంచె సింగర్ నుంచి యాంకర్ , యాక్టర్ అయిన వ్యక్తి. ఈ మధ్య మరీ ఎక్కువ వెబ్ సీరిస లో ..సినిమాల్లో కనిపిస్తున్నారు. ఓ మిడియమ్ బడ్జెట్ సినిమాల్లో కూడా ఆయన మంచి నెగిటివ్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు.
" హైదరాబాద్ కలర్స్ మారుతూ ఉండగా దగ్గర నుంచి చూసినవాడిని నేను. ఆస్తులు కూడబెట్టాలనే ఆలోచనే లేదు. లేదంటే చాలా తక్కువ ధరల్లో ఆస్తులు వస్తున్నా కొనలేకపోయాను. ఎలాంటి అప్పులూ లేకుండా .. నాకు నచ్చినట్టుగానే ఇప్పుడు నా లైఫ్ హ్యాపీగా సాగిపోతోంది. అంతకు మించి అంటే .. అంత ముందుచూపు నాకు లేదనే చెబుతాను. అప్పట్లో హైటెక్ సిటీలో బిల్డింగ్ కొనాలంటే 3,5 లక్షలు పట్టుకుంటే చాలు.
" ఇప్పుడు నా స్టూడియో ఉన్న ఫ్లాట్ నా సొంతమే. 6 ఫ్లాట్లు ఉన్న అపార్టుమెంటు అది. హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. అప్పట్లో నేను 5 లక్షలకు తీసుకున్నాను. ఆ పక్కనే ఉన్న రెండు ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. '11 లక్షలిచ్చి మూడు ఫ్లాట్లు తీసుకోండి' అని ఓనర్ అన్నాడు. ఆటో కూడా రావడంలేదు ఇక్కడ ఎందుకు లే అనుకున్నాను. నాకు ముందు చూపు ఉండి ఉంటే జాగ్రత్త పడేవాడిని.అయినా ఇప్పటికీ చాలా బాధపడుతుంటా..కాస్త బాగా ఆలోచించి ఆస్తులు కూడబెట్టాల్సింది.