Raj Tarun: ఉయ్యాల జంపాల హీరోయిన్ తో లవ్ లో పడ్డారా..?

రాజ్ తరుణ్ ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ  గడిపేవాడు.అలా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న తరుణంలోనే రాజ్ తరుణ్ కు ఉయ్యాల జంపాల సినిమా ఆఫర్ వచ్చింది. దీంతో రాజ్ తరుణ్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాజ్ తరుణ్ కు అవికా గోర్ కు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.అలా ఆమెకు తరచూ ఫోన్లు,మెసేజ్లు చేస్తూ చాలా దగ్గరగా ఉండేవారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో సినిమా చూపిస్త మామ సినిమాలో కూడా చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అవడంతో ఇద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో వీరిద్దరూ పార్టీలు,పబ్బులు అంటూ తిరుగుతూ వచ్చారు.ఇది కాస్త మీడియా కంటపడడంతో అనేక వార్తలు వినిపించాయి. కానీ చివరికి అవికా గోర్ కు ఇదివరకే మరొకరితో రిలేషన్ ఉందని తెలుసుకున్నటువంటి రాజ్ తరుణ్ ఆమెకు దూరమయ్యాడు. అలా వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయిందట


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-07/1720358892_avika.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం గురించి  చర్చ జరుగుతోంది. లావణ్య అనే యువతిని ప్రేమించి మోసం చేశాడని ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మీడియా ముందుకు రావడంతో రాజ్ తరుణ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ తరుణంలో  స్పందించినటువంటి రాజ్ తరుణ్  అదంతా ఫేక్ అని స్నేహితులుగా ఉంటే ఆమె మరో రిలేషన్ నాకు అంటగడుతోందని, ఆమె అలా చాలామందితో రిలేషన్ లో ఉందని అలా బెదిరిస్తూ డబ్బులు నొక్కేయాలని చూస్తుందని రివర్స్ కేసు పెట్టారు. ప్రస్తుతం ఆ వ్యవహారం అలా నడుస్తున్న తరుణంలోననే రాజ్ తరుణ్ ప్రేమ వ్యవాహారాలన్నీ బయటకు వస్తున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

రాజ్ తరుణ్ ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ  గడిపేవాడు. డైరెక్టర్ అవ్వాలని ఉండేదట. అలా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న తరుణంలోనే రాజ్ తరుణ్ కు ఒక మంచి ఆఫర్ వచ్చింది. దీంతో ఆయన లైఫ్ చేంజ్ అయింది. ప్రొడ్యూసర్ రామ్మోహన్ నాగార్జున తో కలిసి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఇదే తరుణంలో కొత్తవారికి చాన్స్ ఇవ్వాలనుకున్నారు. విరంచి వర్మ అనే కొత్త డైరెక్టర్ ను ఫిక్స్ చేసి ఆడిషన్ నిర్వహించగా రాజ్ తరుణ్ ఆడిషన్ కు వచ్చారు. కానీ ఆయన ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేదు.

కానీ ఈ మూవీకి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలనే కోరికతో  తాను చేసిన సినిమాలన్నీ ఆ డైరెక్టర్ కు చూపించారు. దీంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈయననే అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. ఇక హీరోయిన్ గా  చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ లో చేసినటువంటి అవికా గోర్ ను తెలుగులో పరిచయం చేయాలని అనుకున్నారు నాగార్జున. దానికి అవికా గోర్ కూడా ఒప్పుకోవడంతో ఆమెని హైదరాబాద్ తీసుకొచ్చారు.

అయితే మరోసారి ఆడిషన్ పెట్టగా 25 మంది  వచ్చారు. వారందరికీ రాజ్ తరుణ్ డైలాగ్స్ ఇతర  వివరాలు వివరించేవాడు. ఎవరు కూడా  డైరెక్టర్ అనుకున్నటువంటి పాత్రలో కరెక్ట్ గా చేయలేకపోయారు. ఒక్కొసారి పెట్టిన కండిషన్స్ కూడా ఒప్పుకోలేదు. వచ్చిన వారందరికీ అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిన రాజ్ తరుణ్ చూసి చివరికి ఆయననే ఓకే చేసేసారు. కండిషన్స్ అంటే 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. దీంతో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి తన ఇల్లు తాకట్టు పెట్టించి 25 లక్షల రూపాయలు తీసుకువచ్చి డిపాజిట్ చేశారు. అలా సినిమా స్టార్ట్ అయింది మొత్తం సినిమాకు ఎనిమిది కోట్ల బడ్జెట్ పెట్టారు. సినిమా పూర్తయి థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ సాధించి మొత్తం 16 కోట్ల వసూళ్లు చేసింది. దీంతో రాజ్ తరుణ్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రాజ్ తరుణ్ కు అవికా గోర్ కు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

అలా ఆమెకు తరచూ ఫోన్లు,మెసేజ్లు చేస్తూ చాలా దగ్గరగా ఉండేవారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో సినిమా చూపిస్త మామ సినిమాలో కూడా చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అవడంతో ఇద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో వీరిద్దరూ పార్టీలు,పబ్బులు అంటూ తిరుగుతూ వచ్చారు.ఇది కాస్త మీడియా కంటపడడంతో అనేక వార్తలు వినిపించాయి. ఇది నాగార్జునకు తెలిసి ఆయన  అవికా గోర్ ను పూర్తిస్థాయిలో విడిచి పెట్టేశారు. కానీ చివరికి అవికా గోర్ కు ఇదివరకే మరొకరితో రిలేషన్ ఉందని తెలుసుకున్నటువంటి రాజ్ తరుణ్ ఆమెకు దూరమయ్యాడు. అలా వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయిందట

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna rajtarun uyyala-jampala avika-gor

Related Articles