Rajtarun:రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య ప్రెగ్నెంట్..కానీ.?

ఈ మధ్యకాలంలో  సోషల్ మీడియాలో హల్చల్ చేసిన న్యూస్ ఏంటయ్యా అంటే హీరో రాజ్ తరుణ్ కు సంబంధించినటువంటి న్యూస్. రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి వాడుకొని మోసం చేశాడని  సోషల్ మీడియా, మెయిన్ మీడియా అంతా కోడై కూసింది. తనను విపరీతంగా మోసం చేశాడని రాజ్ తరుణ్  చాలా రోజులు రిలేషన్ లో ఉండి ఇప్పుడు కాదంటున్నారని ఆమె తెలియజేసింది. ఆ వివరాలు ఏంటో చూసేద్దాం.  హీరో రాజ్ తరుణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720601979_rajtraunlover11720164583.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో  సోషల్ మీడియాలో హల్చల్ చేసిన న్యూస్ ఏంటయ్యా అంటే హీరో రాజ్ తరుణ్ కు సంబంధించినటువంటి న్యూస్. రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి వాడుకొని మోసం చేశాడని  సోషల్ మీడియా, మెయిన్ మీడియా అంతా కోడై కూసింది. తనను విపరీతంగా మోసం చేశాడని రాజ్ తరుణ్  చాలా రోజులు రిలేషన్ లో ఉండి ఇప్పుడు కాదంటున్నారని ఆమె తెలియజేసింది. ఆ వివరాలు ఏంటో చూసేద్దాం.  హీరో రాజ్ తరుణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు.

ఉయ్యాల జంపాల, కుమారి 21ఎఫ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొంది ఫామ్ లో దూసుకుపోతున్నారు. అలాంటి రాజ్ తరుణ్ గురించి ఈ మధ్యకాలంలో తన మాజీ ప్రేయసి లావణ్య  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  రాజ్ తరుణ్ తనతో లవ్ లో ఉండి కొన్నాళ్లు నన్ను వాడుకొని తర్వాత మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఉంటున్నాడని కేసు పెట్టింది. ఇది కాస్త పెద్ద వివాదంగా మారింది. అంతేకాకుండా  రాజ్ తరుణ్ నన్ను నా తమ్ముడిని బెదిరిస్తున్నాడని  చెప్పింది.

అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను పోలీసులకు మరియు మీడియాకు అందించింది. ఈ మ్యాటర్  కాస్త హల్చల్ అవ్వడంతో రాజ్ తరుణ్ స్పందించారు. అదంతా అబద్ధమని, తాను అలా ఏమి చేయలేదని ఆమె అందర్నీ అలాగే బెదిరిస్తూ వస్తోందని కొన్ని రకాల ఫ్రూప్స్ చూపించాడు. దీంతో అభివాదం కాస్త అక్కడే సద్దుమణిగింది.

ఇదే తరుణంలో లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై కేసు పెట్టిందట.  మేము గత పదేళ్లుగా కాపురం చేస్తున్నామని, కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ నన్ను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ కూడా చేయించాడని తెలియజేసింది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి మెడికల్ పత్రాలను కూడా తీసుకువచ్చింది. వీటిలో లావణ్య పేరు కాకుండా అన్విక అనే పేరుతో  మేమిద్దరం కలిసి ఉన్నామని తెలియజేసింది. ఈ పేరు మీదే విదేశాలకు కూడా వెళ్లి వచ్చామని తెలిపింది. ఈ విధంగా లావణ్య రాజ్ తరుణ్ ను దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. తనకు ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా చెప్పడంతో అది కాస్త మరోసారి వివాదంగా మారింది.

 

newsline-whatsapp-channel
Tags : rajtarun lavanya

Related Articles