కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి రజినీకాంత్ నిన్న రాత్రి హాస్పిటల్ లో చేరిన సంగతి మనకు తెలిసిందే.ఆయన తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్ కి చేరగా డాక్టర్లు వెంటనే ఆయనకు వైద్యం అందించారు. అయితే రజినీకాంత్
న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి రజినీకాంత్ నిన్న రాత్రి హాస్పిటల్ లో చేరిన సంగతి మనకు తెలిసిందే.ఆయన తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్ కి చేరగా డాక్టర్లు వెంటనే ఆయనకు వైద్యం అందించారు. అయితే రజినీకాంత్ హాస్పిటల్ కి వెళ్ళాడు అనే విషయం తెలియగానే చాలామంది అభిమానులు అయోమయంలో పడిపోయారు.
దాంతో అభిమానులలంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడంతో రజినీకాంత్ భార్య స్పందించి రజినీకాంత్ గారి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది.ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని చెప్పగానే అభిమానులందరూ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రజినీకాంత్ ఆరోగ్యం కాస్త సీరియస్ గానే ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం 73 ఏళ్ల వయసు ఉన్న రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా వస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెట్టయాన్,కూలి వంటి సినిమాల్లో చేస్తున్నారు.ఈయన నటించిన సినిమా వెట్టయాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ అస్వస్థతకు గురవడం చాలా మందిని బాధపెడుతోంది.
ఇక రజినీకాంత్ కోలుకోవాలని ఇప్పటికే చాలామంది అభిమానులతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి బయటికి రావాలని మనం కూడా ఆ దేవున్ని ప్రార్థిద్దాం