సీనియర్ అసిస్టెంట్ మధన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి జాయింట్ కలెక్టర్ రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి జిల్లా ఆడిషన్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. మంగళవారం ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, సీనియర్ అసిస్టెంట్ మధన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి జాయింట్ కలెక్టర్ రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సీనియర్ అసిస్టెంట్ ద్వారా డబ్బును భూపాల్‌రెడ్డి అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు దాడి చేయగా.. భూపాల్‌రెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు నాగోల్‌లోని భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగానే రూ.16లక్షల నగదు, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.