Revanth: దమ్ముంటే రాజీనామా చెయ్ రవ్వంత రెడ్డి.. వైరల్‌ అవుతున్న ఫ్లెక్సీలు

 చెప్పింది కొండంత.. చేసింది గోరంత, దమ్ముంటే రాజీనామా చెయ్.. రవ్వంత రెడ్డి, రుణమాఫీ మాటతప్పి మోసం.. రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 


Published Aug 17, 2024 11:36:52 AM
postImages/2024-08-17/1723874812_flexi.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు అర్హత ఉన్నవారందరికీ మూడు విడతల్లో అందరికీ రుణమాఫీ చేశామని  సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు తమకు అన్ని అర్హతలు ఉన్నా ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడలేదని రైతులు వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా.. రుణమాఫీ చేస్తే ఇచ్చిన మాట ప్రకారం హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు సిద్దిపేటలోని హరీష్ రావు క్యాంపు ఆఫీసులు వద్ద ఆందోళ చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు ఈ దుమారం కొనసాగుతుండగా.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు, హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. రుణమాఫీ విషయంలో మాట నిలుపుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని.. అందుకు సీఎం రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు పెట్టారు. చెప్పింది కొండంత.. చేసింది గోరంత, దమ్ముంటే రాజీనామా చెయ్.. రవ్వంత రెడ్డి, రుణమాఫీ మాటతప్పి మోసం.. రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం అని.. రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.17 వేల కోట్లతో సరిపెట్టారని రేవంత్‌పై విమర్శలు రైతులు విమర్శలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. 

 

newsline-whatsapp-channel
Tags : ts-news revanth-reddy news-line newslinetelugu congress telanganam cm-revanth-reddy runamafi

Related Articles