R.Narayana Murthy : పుకార్లు నమ్మొద్దు.. నేను బాగానే ఉన్నా!

సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లపై ఆర్.నారాయణ మూర్తి స్పందించారు. నిజం తెలుసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published Jul 18, 2024 05:10:50 AM
postImages/2024-07-17/1721231479_RNarayanamurthy.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు. తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. చిన్న ఆరోగ్య సమస్య వల్ల నిమ్స్ దవాఖానాలో చికిత్స తీసుకుంటున్నానని.. ఎలాంటి ప్రమాదం లేదని ఆర్.నారాయణ మూర్తి తెలిపారు.

వైద్యులు బాగా మంచి వైద్యం అందిస్తున్నారన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు చెప్తా అని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని ఆయన తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : viral-news health-news movies health-problems social-media

Related Articles