Rocking Rakesh – Sujatha : బిగ్ బాస్ ఫేమ్ సుజాత బేబీబంప్ ఫొటో షూట్

రీసెంట్ గా  సుజాతకు అత్తింటి వారు శ్రీమంతం నిర్వహించగా రాకింగ్ రాకేష్, సుజాత పలు బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసారు. అలాగే ఓ వీడియో కూడా చేసి తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు.


Published Aug 05, 2024 05:01:28 AM
postImages/2024-08-05/1722837447_rockingrakesh.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జబర్దస్త్ తో పరిచయమైన రాకింగ్ రాకేష్ ...జోర్ధార్ సుజాత కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.ఇప్పుడు ఈ జంట తల్లి తండ్రులు కాబోతున్నారు.ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. ఇక  టీవీ యాంకర్ గా పనిచేసే సుజాత బిగ్ బాస్ లో పాల్గొని బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సుజాత ..సేవ్ ది టైగర్స్ ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.


రీసెంట్ గా  సుజాతకు అత్తింటి వారు శ్రీమంతం నిర్వహించగా రాకింగ్ రాకేష్, సుజాత పలు బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసారు. అలాగే ఓ వీడియో కూడా చేసి తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. త్వరలోనే డెలివరీ కానుందని సుజాత తెలిపింది. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి.. అమ్మానాన్న అనే పిలుపుకి దగ్గర్లో. గొప్ప తల్లిదండ్రులు అవ్వాలని ఆశీర్వదించండి అంటూ పోస్ట్ చేసారు రాకేష్, సుజాత.


గ్రీన్ కలర్ పట్టుచీరతో చాలా అందంగా మెటర్నిటీ ఫొటో షూట్ చేయించుకుంది సుజాత. తన భర్తతో పాటు చక్కగా పిక్స్ దిగి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తమ బెస్ట్ విషెస్ అందించారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news movies

Related Articles