Residential: కుళ్లిపోయిన కూరగాయలతో భోజనం

 కుళ్లిన కూరగాయలతో తయారు చేసిన ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. మెస్ ఇన్ ఛార్జ్ కు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. 


Published Aug 05, 2024 02:56:14 PM
postImages/2024-08-05/1722849974_residential.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రభుత్వ రెసిడెన్షియల్ కాళాశాలలో కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని బుదేర మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ ప్రభుత్వ గురుకుల కాళాశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. తమకు కుళ్లిన కూరగాయలతో తయారు చేసిన ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. మెస్ ఇన్ ఛార్జ్ కు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. 

కుళ్లిపోయిన కూరగాయలతో తయారు చేసిన నాసిరకం భోజనం తినడం కారణంగా అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ సరిగ్గా అమలుచేయడం లేదని, కుళ్లిన కూరగాయలతో ఒకే రకమైన కూర వండి పెడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : ts-news news-line newslinetelugu telanganam residential-teachers food-safety residentialschool

Related Articles