RS Praveen: మూసీ సుందరీకరణ కాదు.. రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి

మూసీ సుందరీకరణ మీద ఆసక్తి చూపుతున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు మూలంగా ఎంత మంది జీవితాలు బాగుపడతాయి అని ప్రశ్నించారు.


Published Aug 09, 2024 03:48:48 PM
postImages/2024-08-09/1723198728_rspraveen.PNG

న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 60 టీఎంసీల నీళ్లను 90 రోజుల్లో తెచ్చుకునే విధంగా కేసీఆర్ ఈ పథకం రూపొందించారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి పథకంలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన పథకాలను రేవంత్ రెడ్డి ఎన్నడూ సందర్శించలేదని విమర్శించారు. అమెరికాలోని మిసిసిపీ అందాలను చూసి రేవంత్ ఆస్వాదిస్తున్నాడని, రోజుకు 30 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి.. ఆంధ్రా రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టుల పూర్తి చేయడానికి మూడున్నర దశాబ్దాలు పట్టింది.. కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు మూడున్నరేళ్లలో తుది దశకు తీసుకువచ్చారని తెలిపారు. తాజా బడ్జెట్‌లో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు కనీస బడ్జెట్ కేటాయించలేదని, మూసీ సుందరీకరణ మీద ఆసక్తి చూపుతున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు మూలంగా ఎంత మంది జీవితాలు బాగుపడతాయి అని ప్రశ్నించారు. లక్ష 50 వేల కోట్లతో మూసీని సుందరీకరిస్తామంటున్న రేవంత్ రెడ్డి పాలమూరు మీద ఎందుకు ప్రేమ చూపడం లేదని మంపడ్డారు. 

శ్వేత పత్రాలు విడుదల చేస్తూ రేవంత్ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడని, రాజుల కాలంలో కూడా ఎన్నడూ ఎవరి పాలన మీద శ్వేత పత్రాలు విడుదల చేయలేదన్నారు. 44 వేల కోట్ల బడ్జెట్ నుండి సాగునీటిపై 22 వేల కోట్లకు బడ్జెట్ కుదించారని, మేడిగడ్డలో కెమెరా ఎగిరేశారని కేటీఆర్ మీద కేసు పెట్టారు.. మరి తెలంగాణలో ఎగురుతున్న ఎన్ని కెమెరాల మీద కేసు పెడతారు అని ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ విద్యార్థులు, రైతాంగం మీద రేవంత్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాడని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను తెల్ల ఏనుగులుగా పేర్కొనడం అవగాహన రాహిత్యం అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana brs congress cm-revanth-reddy america

Related Articles