శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పినప్పటికీ రాజకీయ లబ్ది కోసమే కావాలని అతిగా రియాక్ట్ అవుతున్నారని ఆమె ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్టీ సమావేశంలో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తున్న మహిళా మంత్రులు.. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పినప్పటికీ రాజకీయ లబ్ది కోసమే కావాలని అతిగా రియాక్ట్ అవుతున్నారని ఆమె ఆరోపించారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న మలక్ పేటలో అంధ విద్యార్థిమీద జరిగిన సంఘటనపై ఆ ఇద్దరు మహిళా మంత్రులు ఎందుకు స్పందించ లేదని సబిత ప్రశ్నించారు. పోలీసు శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారమే గత 8 నెలలుగా 1800 మహిళలపై సంఘటనలు జరిగాయని ఆమె తెలిపారు. మరి ఆ మహిళా మంత్రులు అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
గత 8 నెలల నుండి ఆడవారిపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు సమయంలో కనీసం ఒక్కసారి కూడా స్పందించని మహిళా మంత్రులు అప్పుడు ఎక్కడికి వెళ్లారని ఆమె ప్రశ్నించారు. ఓ మహిళా ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ అత్యాచారం చేశాడు. విచారణ పేరుతో ఓ దళిత మహిళపై పోలీసులుథర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆమె అన్నారు. పెద్దపల్లిలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగిన సమయంలో ఈ మహిళా మంత్రులు నోరుమెదపలేదని సబిత అన్నారు.