మా అన్నయ్య డ్రైవర్, మా తమ్ముడు డ్రైవర్ వారికి లారీలు ఉన్నాయని చెబుతారు. అసలు ఎందుకు ఈ లారీ సెంటిమెంట్ ..అంటారా చూసేద్దాం రండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఊరంతా లారీ డ్రైవర్లే ..అదేంటి అనుకుంటున్నారా..ఊరంతా కవలలు..ఊరంతా ఐటీ ఉద్యోగులే లాంటి వార్తలు మనం ఎన్ని చూడడం లేదు. అలానే ఇది కూడా ఓ వృత్తే కదా..అలానే ఆ ఊరంతా లారీ డ్రైవర్లు ..లారీ ఓనర్లే. మా అన్నయ్య డ్రైవర్, మా తమ్ముడు డ్రైవర్ వారికి లారీలు ఉన్నాయని చెబుతారు. అసలు ఎందుకు ఈ లారీ సెంటిమెంట్ ..అంటారా చూసేద్దాం రండి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవి చెర్వు గ్రామంలో 130 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లోని సుమారు 100కు పైగా కుటుంబాలు గత 45 ఏళ్లుగా లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇలా ప్రతి ఇంట్లోను ఎవరో ఒకరు లారీ తో సంబంధించిన వృత్తిలోనే స్థిరపడ్డారు. కోవిడ్ రానంత వరకు ఊర్లో దాదాపు 150 లారీలు ఉండేవి.
మొదట క్లీనర్‌గా పని చేసిన వారు డ్రైవర్లుగా మారడం, ఆ తర్వాత లారీ యజమానులుగా మారి లారీ ఓనర్ కమ్ డ్రైవర్‌గా మారుతున్నారు. అలా వ్యాపారం పెంచుకొని ఒక్కొక్కరు నాలుగు లారీలు ...లేదా వెహికల్ రెంట్ కు తీసుకొని వ్యాపారం చెయ్యడం ప్రారంభించారు. మరికొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ కాకపోయినా లారీలు కొని వ్యాపారం చేయడం ఇలా ఏదో ఒకటి చేసి లారీలు నడుపుతున్నారు.
కాని ఇదంతా కోవిడ్ ముందు వరకు పరిస్థితి. కోవిడ్ తర్వాత వ్యాపారాలు లేక కొన్ని అమ్మేశారు. ఇప్పుడు నాలుగు లారీలు ఉన్నవాళ్లు రెండింటికే పరిమితం అవుతున్నారు. కేవలం ఒక్క లారీ మాత్రమే ఉన్నవాళ్లు డ్రైవర్లుగా మారి నడుపుతున్నారు. ఇలా ఇప్పుడు సుమారు వంద లారీలు వరకు ఆ గ్రామంలో ఉన్నాయి. దసరా సంధర్భంగా ఊరంతా లారీలు ఇంటికి చేరుకున్నాయి. సందడి సందడిగా ఉండడంతో పండుగ వాతావరణం నెలకొంది.