movies: ఈ అమ్మాయి ...టాలీవుడ్ , బాలీవుడ్ హీరోయిన్ ..గుర్తుపట్టారా ?

 హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా కూడా ఉంది. ఏమైందో ఏమో...సడన్ గా సోషల్ మీడియాలో తన పిక్ ఒక్కటి కూడా కనిపించకుండా డిలీట్ చేసేసి ...వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి పెళ్లి చేసేసుకుంది. కంప్లీట్ హౌస్ వైఫ్ గా మారి ..హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. 


Published Jul 11, 2024 05:50:00 PM
postImages/2024-07-11/1720700563_sanakhan167903081556416790308157411679030815741.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది హీరోయిన్స్ కెరియర్ పీక్ లో ఉన్నపుడు ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటారు. అందులో ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, కళ్యాణ్ రామ్ , బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరియర్ టాప్ లో ఉన్నపుడే చడీ చప్పుడు లేకుండా పెళ్లిచేసుకొని వెళ్లిపోయింది.


 హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా కూడా ఉంది. ఏమైందో ఏమో...సడన్ గా సోషల్ మీడియాలో తన పిక్ ఒక్కటి కూడా కనిపించకుండా డిలీట్ చేసేసి ...వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి పెళ్లి చేసేసుకుంది. కంప్లీట్ హౌస్ వైఫ్ గా మారి ..హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. 

ముంబైకు చెందిన సనాఖాన్ కెరీర్ ఆరంభంలో పలు హిందీ సినిమాలు, సీరియల్స్ లో నటించింది. కల్యాణ్ రామ్ కత్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తర్వాత గగనం , మిస్టర్ నూకయ్య, లాంటి సినిమాలు యాక్ట్ చేసింది. తమిళ్ , హిందీలో కూడా సినిమాలు చేసింది. తన సత్తా చాటి ..మంచి రోల్స్ తీసుకునే టైంకి పెళ్లి అయ్యిందనే వార్తలు బయటపడ్డాయి. రీసెంట్ తన భర్త , కొడుకుతో ..హజ్ యాత్రకు వెళ్తూ..ఓ స్పెషల్ వీడియో తీసుకొని పోస్ట్ చేసింది. కాసింత బొద్దుగా మారినా ...ఇప్పటికి చాలా అందంగా ఉంది సనాఖాన్.


2019లో విశాల్ నటించిన అయోగ్య సినిమాలో చివరి సారిగా కనిపించింది. ఆతర్వాత ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకుంది సనాఖాన్. దుబాయ్ కు చెందిన అనస్ సయ్యద్‌ తో కలిసి నిఖా పక్కా చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు సయ్యద్ తారిఖ్ జమీల్‌ అనే బాబు కూడా. క్యూట్ ఫ్యామిలీ. ఇన్నాళ్లు బాబును సోషల్ మీడియాలో రివీల్ చెయ్యలేదు. ఈ సారి వీడియోలో మాత్రం కొడుకు ఫేస్ రివీల్ చేసింది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood bolly-wood

Related Articles