ఏప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ లైంగిక వివాదం గురించే కనిపిస్తోంది. తనకు అసిస్టెంట్ గా చేసే ఒక అమ్మాయిని జానీ మాస్టర్ లైంగికంగా వేధించి ఇబ్బందులకు గురి
న్యూస్ లైన్ డెస్క్: ఏప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ లైంగిక వివాదం గురించే కనిపిస్తోంది. తనకు అసిస్టెంట్ గా చేసే ఒక అమ్మాయిని జానీ మాస్టర్ లైంగికంగా వేధించి ఇబ్బందులకు గురి చేశాడని ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా ఆయనను రిమాండ్ కూడా చేశారు.
అలాంటి జానీ మాస్టర్ ఆ అమ్మాయిని మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలు పెట్టారని, అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి క్లాసికల్ డాన్సర్ గా ఉండేదట. ఒకానొక సమయంలో జానీ మాస్టర్ ఏదో ప్రోగ్రాంలో ఆమెను చూసి మొదటిసారి మనసు పారేసుకున్నారట. ఐశ్వర్యరాయ్ లా కళ్ళు ఉన్నాయని నా మనసు కరిగిపోయిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా ఆమెని ఎలాగైనా దగ్గర చేసుకోవాలనుకున్న జానీ మాస్టర్ కొన్నాళ్ళ తర్వాత డైరెక్టుగా ఆమెను కలిసి నా దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకుంటానని చెప్పి చివరికి అసిస్టెంట్ గా పెట్టుకున్నారట. ఇద్దరు కలిసి ఈగ సినిమాకు కొరియోగ్రాఫర్లుగా చేశారు.
అప్పటికి ఆమె వయసు 16 సంవత్సరాలు అన్నట్టు తెలుస్తోంది. అప్పుడే ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. వీరి విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియడంతో, మాస్టారు ముస్లిం క్యాస్ట్ అని చెప్పేసి రిజెక్ట్ చేశారట. దీంతో ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని చెప్పేసి లైంగిక దాడి చేస్తూ వచ్చారట. అమ్మాయిని లోపర్చుకొని ఇబ్బందులకు గురి చేశాడని తెలుస్తోంది. అయితే జానీ మాస్టర్ ను ఆమె పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకొని ఇలా చేశాడని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.