ఇంట్లో కష్టాలను చాలా బాగా అర్ధం చేసుకునేవారు. తన తో ఉన్నవాళ్లు కూడా పైకి రావాలని ఆలోచించే గొప్ప వ్యక్తి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పెద్దగా పరిచయాలు అవసరం లేదు..కొన్ని రోజులుగా జానీ మాస్టర్ విషయం ఫుల్ ట్రెండ్ లో ఉంది. తప్పు ఎవరిది అని ఒక్కఒక్కొరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. అయితే జానీ మాస్టర్ శిష్యుడు జానీ మాస్టర్ కోసం కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు బయటపెట్టారు. జానీ మాస్టర్ చాలా చిన్న స్థాయినుంచి వచ్చారు. ఇంట్లో కష్టాలను చాలా బాగా అర్ధం చేసుకునేవారు. తన తో ఉన్నవాళ్లు కూడా పైకి రావాలని ఆలోచించే గొప్ప వ్యక్తి.
ఆ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడి ఉంటే ఆ రోజే చెప్పేది కదా.. ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఎందుకు ఉందంటూ జానీ శిష్యుడు ప్రశ్నించాడు. విచారణకు అవకాశం లేకుండా దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిందని చెబుతుంది. ఇవన్నీ ఆరోపణలే అయితే ...ఫోన్లో మెసేజ్ లు ..క్రియేట్ చేయడం ఎంతసేపు.. జానీ మాస్టర్ తప్పులు చేశాడా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది. కాని డాన్సర్స్ అంతా న్యాయం కోసం పోరాడతామని చెప్పారు.
ఇండస్ట్రీ లో 60 శాతం మంది జానీ మాస్టర్ పై కుట్ర జరుగుతుందనే చెబుతున్నారు. అయినా జానీ మాస్టర్ ను దోషిగా నిలబెట్టారని వాపోయాడు. ఏది ఏమైనా నిజం న్యాయస్థానం తేలుస్తుంది. కష్టం నుంచి వచ్చినవాడు మా జానీ మాస్టర్ ఇలాంటి వాటికి బెదిరిపోరు. కచ్చితంగా జానీ మాస్టర్ పై నేరం రుజువు కాదు. ధైర్యంగా వస్తారు చూడండి అంటూ చెప్పుకొచ్చాడు.