ప్రస్తుతం మీడియాలో రాజ్ తరుణ్,లావణ్యల వ్యవహారం వైరల్ అవ్వడంతో తాజాగా ఓ నెటిజన్ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ షాకింగ్ కామెంట్ పెట్టాడు.. ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే.. భారతీయ న్యాయ సంహితలోని BNS సెక్షన్ 69 ప్రకారం ఓ వ్యక్తి వివాహం చేసుకుంటానని మహిళకి వాగ్దానం చేసి ఆమెతో లైం**కంగా సంబంధం ఏర్పరచుకొని మాట తప్పినట్లయితే ఆ వ్యక్తికి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ రాజ్ తరుణ్ కూడా లావణ్యతో సంబంధం ఏర్పరచుకున్నారు.అలాగే గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడని లావణ్య చెప్పింది.ఒకవేళ ఇదే నిజమైతే రాజ్ తరుణ్ కి నిజంగానే జైలు శిక్ష పడుతుందా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాజ్ తరుణ్ వ్యవహారం మీడియాలో ఎంత పెద్ద దుమారం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ నన్ను నమ్మించి మోసం చేశాడు అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకోవడమే కాకుండా నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.11 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న నన్ను పక్కనపెట్టి మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ రచ్చ రచ్చ చేసింది.అయితే ఈ వ్యవహారంపై తాజాగా రాజ్ తరుణ్ దీనిపై స్పందించి అవన్నీ పచ్చి అబద్దాలు అంటూ కొట్టి పారేసాడు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. నేను లావణ్య తో రిలేషన్ లో ఉన్నది నిజమే. కానీ అది ఇప్పుడు కాదు..ఒకప్పుడు 2017 లోనే నేను ఆమెను వదిలేసాను.. అయితే హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో నాకు లావణ్య చాలా సహాయం చేసింది.. అందుకే ఆమె ఎంత టార్చర్ చేసినా కూడా ఇప్పటివరకు నేను ఓపిక పడుతూ చూసాను. లావణ్య చాలా బ్యాడ్ క్యారెక్టర్..ఆమె చాలా వైలెంట్ ఆమెతో నేను ఉండలేకపోయాను నేను పద్ధతిగా ఉంటాను. ఇక ఎప్పుడైతే లావణ్య డ్రగ్స్ తీసుకుంటుంది అని తెలిసిందో అప్పటినుండి ఆమెను దూరం పెట్టేసాను.నాకు కూడా మందు అలవాటు, సిగరెట్ అలవాటు ఉంది కానీ డ్రగ్స్ మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు తీసుకోను కూడా.
ఆమె నా విల్లాలో నా ముందే మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసి ఉంది. నేను కింద ఉంటే ఆమె మీది ప్లాట్లో ఆ వ్యక్తితో కలిసి ఉంది.కేవలం డబ్బు కోసమే లావణ్య నన్ను టార్చర్ చేస్తుంది. ఇన్ని రోజులుగా ఆమె ఎన్నిసార్లు డబ్బు అడిగినా ఇచ్చాను.కానీ ఈ మధ్యకాలంలో ఆమె తన తమ్ముడి ద్వారా 20,000 అడగమని చెప్పింది.కానీ నేను ఇవ్వనని చెప్పేసరికి నాపై కేసు పెట్టింది. ఇన్ని రోజులు నేను పరువు పోకూడదని ఓపిక పట్టాను. కానీ ఇంకా ఓపిక పట్టలేను. కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తుంది. అంటూ రాజ్ తరుణ్ మీడియాతో చెప్పారు. అయితే ప్రస్తుతం మీడియాలో రాజ్ తరుణ్,లావణ్యల వ్యవహారం వైరల్ అవ్వడంతో తాజాగా ఓ నెటిజన్ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ షాకింగ్ కామెంట్ పెట్టాడు..
ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే.. భారతీయ న్యాయ సంహితలోని BNS సెక్షన్ 69 ప్రకారం ఓ వ్యక్తి వివాహం చేసుకుంటానని మహిళకి వాగ్దానం చేసి ఆమెతో లైం**కంగా సంబంధం ఏర్పరచుకొని మాట తప్పినట్లయితే ఆ వ్యక్తికి దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ రాజ్ తరుణ్ కూడా లావణ్యతో సంబంధం ఏర్పరచుకున్నారు.అలాగే గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడని లావణ్య చెప్పింది.ఒకవేళ ఇదే నిజమైతే రాజ్ తరుణ్ కి నిజంగానే జైలు శిక్ష పడుతుందా అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది