Sreeleela: ప్రేమలో పడిన శ్రీలీల.. అబ్బాయి ఎవరంటే..?

శ్రీ లీల.. ఈ పేరు చెప్పగానే చాలామంది కుర్రకారుకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈమె చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్ అయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఇండస్ట్రీలో తన క్రేజ్ మాత్రం


Published Sep 19, 2024 07:41:06 PM
postImages/2024-09-19/1726755066_sreeleela.jpg

న్యూస్ లైన్ డెస్క్: శ్రీ లీల.. ఈ పేరు చెప్పగానే చాలామంది కుర్రకారుకి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈమె చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్ అయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఇండస్ట్రీలో తన క్రేజ్ మాత్రం పోగొట్టుకోలేదు. ఎంతోమంది కుర్రకారుని తన అందంతో తన వైపుకు లాగేసుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.

మరి ఇంతకీ శ్రీలీల ప్రేమలో పడ్డ ఆ వ్యక్తి ఎవరు.. ఈ విషయం ఎలా బయటపడింది అనే సంగతి ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోయిన్లు సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేస్తూ ఉంటారు. అలా తాజాగా శ్రీలీల కూడా తన అభిమానులతో సోషల్ మీడియా ఖాతా ద్వారా చిట్ చాట్ చేసింది.

ఇందులో భాగంగా ఎంతో మంది అభిమానులు ఆమె సినిమాల గురించి ఆమె కూతురు ప్లాన్స్ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగా ఒక అభిమాని అయితే ఒక అడుగు ముందుకు వేసి శ్రీలీలకు ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఐ లవ్ యు అంటూ కామెంట్ పెట్టేశాడు. దాంతో శ్రీ లీల అభిమాని పెట్టిన కామెంట్ ని అలా వదిలేయకుండా (muah muah i love you) అంటే రిప్లై ఇచ్చింది.

ఇక ఆ నెటిజన్ పెట్టిన పోస్ట్ కి శ్రీలీల కూడా ఐ లవ్ యు అని రిప్లై ఇవ్వడంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో చాలా మంది నెటిజన్స్ అభిమానితో ప్రేమలో పడిపోయిన శ్రీలీల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : news-line sreeleela sreeleela-marraige social-media sreeleela-love

Related Articles