మనమే పాప్ కార్న్ ను ఎందుకు కొత్తగా ట్రై చెయ్యకూడదు.స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్, ఎలా చేయాలో చూడండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : థియేటర్లు మాల్స్ లో పాప్ కార్న్ ఎంత రేటు. అదే ఇంట్లో చేస్తే 30 రూపాయిల ప్యాకెట్ ...హ్యాపీగా ఇంటిల్లపాది తినొచ్చు. కాని థియేటర్ లో రకరకాల పాప్ కార్న్ చేసి వెయ్యి లాగేస్తారు. అసలు మనమే పాప్ కార్న్ ను ఎందుకు కొత్తగా ట్రై చెయ్యకూడదు.స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్, ఎలా చేయాలో చూడండి.
పంచ దార మంచిది కాదు తెలిసినా కొన్నింటికి తప్పదు..మరి వాటి రుచి కోసం అధికంగా తింటే అందులో ఉండే పంచదార శరీరంలో అధికంగా చేరుతుంది. కాని ఎప్పుడో తినే పాప్ కార్న్ కి ఏం పర్లేదు. కూసింత రుచి కూడా లేకపోతే మనిషి బతికి దేనికి సో లైట్ అప్పుడప్పుడు ఏం పర్లేదు.జస్ట్ నాలుగే స్టెప్స్ లో తేల్చేయొచ్చు. ట్రై చేసేద్దాం
ఫస్ట్ కప్ లో నాలుగు చెంచాల పంచదార తీసుకొండి. చిటికెడు సోడా తీసుకొండి. ఇది పంచదార ఫాస్ట్ గా గడ్డ కట్టేయకుండా ఉపయోగపడుతుంది. సగం చెంచా బటర్..సగం కప్పు పాప్ కార్న్ తీసుకొండి.
స్వీట్ కోటెడ్ పాప్‌కార్న్ తయారీ విధానం:
ఒక కడాయిలో పంచదార వేసుకోండి. కుదిరినంత సన్నని మంటపై పెట్టుకొండి.
పంచదార కరిగి ముదురు బంగారు వర్ణంలోకి వస్తుంది. దీంట్లో కాస్త సోడా, బటర్ వేసి బాగా కలుపుకోండి. ఇది పంచదార పాకం ముదురుగా అవ్వకుండా చేస్తుంది.
సోడావల్ల కలుపుతూ ఉంటే కాస్త నురుగుగా, తేలిగ్గా అయిపోతుంది పాకం.
ఇప్పుడు ముందుగా బటర్ లేదా నూనెలో చేసి పెట్టుకున్న ప్లెయిన్ పాప్ కార్న్ ఈ పాకంలో కలిపేయండి. ఇప్పుడు అందులో ఈ పాప్ కార్న్ వేసుకొని కలుపుకొండి. ఇప్పుడు టేస్టీ పాప్ కార్న్ మీకోసం .