Tamannaah: విజయ్ కంటే ముందే ఆ ఇద్దరితో చేశా.?

మిల్కీ బ్యూటీ తమన్నా కి ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి.ఎందుకంటే ఈమె ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తుంది.అలా రీసెంట్ గా స్త్రీ -2 మూవీలో ఐటెం సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.


Published Sep 08, 2024 07:09:17 PM
postImages/2024-09-08/1725802757_tamannahvijayvarma.jpg

న్యూస్ లైన్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా కి ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి.ఎందుకంటే ఈమె ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తుంది.అలా రీసెంట్ గా స్త్రీ -2 మూవీలో ఐటెం సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. రీసెంట్గా పెళ్లి గురించి కొంతమంది అడగగా..నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఇప్పట్లో లేదు అంటూ మొహం పైనే ఆన్సర్ ఇచ్చింది.

అయితే తమన్న మాటలు వింటుంటే తమన్నా ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదు. ఎందుకంటే గతంలో తమన్నా ఇద్దర్ని ప్రేమించి మోసపోయిందట.అందుకే మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా పూర్తిగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటుందట.అయితే రీసెంట్ గా రాజ్ షమణి చేసిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. నా హృదయం రెండుసార్లు ముక్కలైంది.మొదట టీనేజ్లో ఆ తర్వాత మరోసారి.. ఇలా రెండుసార్లు నాకు బ్రేకప్ జరిగింది.మొదట టీనేజ్ లవ్ లో నేను అనుకునే ఆశయాలకు  నేను ప్రేమించిన వాడు అడ్డుకట్ట వేశాడు.

దాంతో అతని కోసం నా లైఫ్ ని వదులుకోవాలనే ఆలోచన నాకు లేదు. అందుకే అతనిని వదిలేసాను. అలా మొదటిసారి హార్ట్ బ్రేక్ అయింది. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే జరిగింది.. నేను కొద్ది రోజులు రిలేషన్ లో ఉన్నాను. కానీ ఆ రిలేషన్ లో అబద్ధాలు ఎక్కువైపోయాయి. ప్రతిసారి ఆయన అబద్ధం చెప్పేసరికి నేను అంగీకరించలేకపోయా..అందుకే అతనికి కూడా బ్రేకప్ చెప్పేసాను .

అలా నాకు రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయింది అంటూ తమన్నా మాట్లాడింది. అయితే తమన్నా మొదట్లో కాలేజీ చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించిందని,కానీ అది ఎక్కువ రోజులు నిల్వలేదని తెలుస్తోంది.ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చాక కోలీవుడ్ హీరో కార్తీని తమన్నా ప్రేమించిందని టాక్ వినిపించింది. కానీ కార్తీ తండ్రి కారణంగా వీరిద్దరి పెళ్లి కాలేదట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood stree-2-movie tamannaah vijay-varma

Related Articles