పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తెలంగాణ హైకోర్టులో తీర్పు వెలువడనుంది
న్యూస్ లైన్ డెస్క్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తెలంగాణ హైకోర్టులో తీర్పు వెలువడనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిర్రెడ్డి, వివేకానంద్ కోర్టు తలుపు తట్టారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై మూడునెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావ్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. సోమవారం వెలువడే తీర్పుపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.