Meera Nanadan: గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్.! 2024-06-29 18:00:43

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ విధంగానే ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చి  సరైన సక్సెస్ లేక మరో ఇండస్ట్రీకి పోయిన హీరోయిన్లలో  ఈమె కూడా ఒకరు. ఆమె పేరే మీరా నందన్..  ఈమె పేరు మీరు గుర్తుపట్టలేదు కదూ..జై బోలో తెలంగాణ సినిమాలో నటించి తెలుగు ప్రజలకు ఎంతో కనెక్ట్ అయింది. అలాంటి హీరోయిన్ తాజాగా గురువాయూర్ ఆలయంలో తన ప్రియుడిని పెళ్లాడిందట.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ హీరోయిన్ కేరళకు చెందినది. కోచ్చిలో పుట్టిన ఈమె బుల్లి తెరపై నటించింది. 2008 ఫస్ట్ టైమ్ మలయాళ మూవీ 'ముళ్ల'లో నటించింది. ఆ తరువాత 2009 లో 'వాల్మీకి' చిత్రంతో కొలీవుడ్ లో అడుగు పెట్టింది. 2011లో జై బోలో తెలంగాణ మూవీ ధ్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఆ తరువాత 4th డిగ్రీ, హితుడు,  మూవీలో చేసింది. కానీ ఇండస్ట్రీలో ఆమెకు సరైన హిట్ దొరకలేదు. అయినా పలు టీవీ షోస్, రేడియో జాకీ, మోడల్ గా చేస్తూ కేరీర్ లో రానిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన ప్రియుడు శ్రీజుని సీక్రెట్ గా దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.