Area Hospital: బాలింత మృతి.. హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన

డాక్టర్ ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే, డెలివరీ పూర్తయిన తరువాత మానసకు తీవ్రమైన రక్తస్రామైందని కుటుంబ సభ్యులు తెలిపారు. 


Published Aug 06, 2024 12:41:13 PM
postImages/2024-08-06/1722928273_ramannapeta.jpg

న్యూస్ లైన్ డెస్క్: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతిచెందిందని ఆమె బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మోత్కూర్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన కొల్లు మానస మంగళవారం పురిటినొప్పులతో హాస్పిటల్‌లో చేరగా.. డాక్టర్ ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే, డెలివరీ పూర్తయిన తరువాత మానసకు తీవ్రమైన రక్తస్రామైందని కుటుంబ సభ్యులు తెలిపారు. 

డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నల్లగొండకి తీసుకెళ్లాలని నర్సు చెప్పడంతో హాస్పిటల్ నుండి తీసుకొని వెళ్లామని అన్నారు. అయితే, నల్గొండ తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలోనే మానస మృతిచెందిందని తెలిపారు. దీంతో రామన్నపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మానస మృతిచెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ బయట ఆందోళన చేపట్టారు. 

newsline-whatsapp-channel
Tags : india-people news-line newslinetelugu telanganam areahospital area-hospital

Related Articles