Bigg Boss 8:బిగ్ బాస్ 8 లో ఆ కాంట్రవర్సీ హీరో.. నిజమేనా..?

తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే హౌస్ లోకి ఎవరెవరిని తీసుకురావాలి. ఎలాంటి వారిని తీసుకువస్తే హౌస్ మరింత స్పైసీగా మారుతుంది. మరింత మంది అట్రాక్ట్ అవుతారు అని లెక్కలు వేసుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.అయితే షో ని ఎక్కువ మంది చూడాలంటే కచ్చితంగా అందులో స్వీట్ నెస్ తో పాటు హాట్ నెస్ ఇలా అన్ని కలగలిపి ఉండాలి.తాజాగా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఓ వివాదాల హీరో వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది


Published Jul 24, 2024 03:01:00 PM
postImages/2024-07-24/1721812493_biggboss8.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే హౌస్ లోకి ఎవరెవరిని తీసుకురావాలి.ఎలాంటి వారిని తీసుకువస్తే హౌస్ మరింత స్పైసీగా మారుతుంది. మరింత మంది అట్రాక్ట్ అవుతారు అని లెక్కలు వేసుకుంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.అయితే షో ని ఎక్కువ మంది చూడాలంటే కచ్చితంగా అందులో స్వీట్ నెస్ తో పాటు హాట్ నెస్ ఇలా అన్ని కలగలిపి ఉండాలి.అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా సరే అందమైన అమ్మాయిలతో పాటు ఎక్కువగా మాట్లాడి పాపులర్ అయిన వారినే తీసుకొస్తూ ఉంటారు.

ఇక ఈసారి బిగ్ బాస్ 8 హౌస్ లో కూడా చాలామంది పాపులర్ అయిన వాళ్ళు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీరే అంటూ సోషల్ మీడియాలో ఒక లిస్టు కూడా వైరల్ అవుతుంది. కానీ ఇందులో ఎంత మంది హౌస్ లోకి వెళ్తారు.ఎంత మంది ఫైనల్ అవుతారు అనేది మాత్రం చెప్పడం కష్టం. కొంతమందిని షో స్టార్ట్ అయ్యే ముందు తీసుకున్నాక అసలు హౌస్ లోకి పంపకుండానే బయటికి పంపించేస్తారట.

అలా లోపలి వెళ్తామనే గ్యారంటీ అక్కడికి వెళ్ళిన వారికి కూడా ఉండదట.ఇదంతా పక్కన పెడితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఓ వివాదాల హీరో వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఆ హీరో ఎవరు కాదు ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీతో తెగ హైలెట్ అయిన రాజ్ తరుణ్.. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే రాజ్ తరుణ్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్ని వివాదాల మధ్య బిగ్ బాస్ 8 లోకి రాజ్ తరుణ్ వెళితే షో టిఆర్పి రేటింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది అని భావిస్తున్నారట.

కానీ ఈ రియాల్టీ షో కి రాజ్ తరుణ్ రావడం అనేది అసంభవం. ఇది కేవలం రూమర్ మాత్రమే. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే ఎన్నో కేసులు ఫైల్ అవుతున్నాయి. కనీసం పోలీసులకు అందుబాటులో లేని రాజ్ తరుణ్ బిగ్ బాద్ రియాల్టీ షో కి వచ్చి అన్ని రోజులు అందులో ఉంటారా అనేది నెటిజన్ల ప్రశ్న.అంతే కాదు ఇదంతా ఉట్టి పుకారే అని కొట్టి పారేస్తున్నారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna raj-tarun big-boos8 thiragabadara-saami

Related Articles