టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ల లిస్టులో సమంత కూడా రెండు, మూడు స్థానాల్లోనే ఉంటుంది.తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అది కాస్త వివాదానికి దారి తీసింది. అయితే సమంత తన ట్రీట్మెంట్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిలో బాగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబులైజేషన్ వాడకం మీద సమంత ఇచ్చిన సలహా విపరీతంగా వివాదాస్పదమైంది. హైడ్రోజన్ పేరాక్సైడ్ వాడకంపై తప్పుడు మెసేజ్ సమంత ఇస్తుందని ఒక డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మెసేజ్ పై తాజాగా బ్యాట్మెంటన్ ప్లేయర్ తమిళ హీరో విష్ణు విషయాలు వైఫ్ గుత్తా జ్వాల కూడా స్పందించింది. సమంత తీరుపై ఆమె కాస్త కోపానికి వచ్చింది. జనానికి హెల్త్ టిప్స్ అందిస్తున్న సెలబ్రిటీలకు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ చికిత్స విధానం అవతల వారికి ఉపయోగపడాలి కానీ, చనిపోయే పరిస్థితులు రాకూడదు వాళ్లకు జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ సలహా ఇచ్చింది.అంటూ గుత్తా జ్వాల ట్విట్టర్ వేదికగా సమంతాను ప్రశ్నించింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ల లిస్టులో సమంత కూడా రెండు, మూడు స్థానాల్లోనే ఉంటుంది. అలాంటి సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత సమంతకు వరుసగా ఆఫర్లు రావడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ విధంగా తన నటన అందచందాలతో ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా రాణిస్తూ వస్తోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యతో నటించిన సమయంలోనే ప్రేమలో పడి చివరికి ఆయననే పెళ్లి చేసుకుంది. అలా కొన్నాళ్లపాటు బాగానే కాపురం చేసిన వీరి మధ్య ఏం జరిగిందో ఏమో మధ్యలోనే విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత నాగచైతన్య సమంత ఎవరి దారి వారు చూసుకొని సినిమాలపై దృష్టి పెట్టారు. ఇంతలోనే సమంత అనారోగ్యం చెడిపోవడంతో అనేక ఇబ్బందుల పాలైంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇంకా చికిత్స తీసుకుంటుంది. అలాంటి సమంత ఈ మధ్యకాలంలో ఖుషి సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ఇవే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. తాజాగా తమిళ స్టార్ హీరో అయినటువంటి విజయ్ చిత్రంలో కూడా నటించడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సమంత తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అది కాస్త వివాదానికి దారి తీసింది.
అయితే సమంత తన ట్రీట్మెంట్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిలో బాగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబులైజేషన్ వాడకం మీద సమంత ఇచ్చిన సలహా విపరీతంగా వివాదాస్పదమైంది. హైడ్రోజన్ పేరాక్సైడ్ వాడకంపై తప్పుడు మెసేజ్ సమంత ఇస్తుందని ఒక డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మెసేజ్ పై తాజాగా బ్యాట్మెంటన్ ప్లేయర్ తమిళ హీరో విష్ణు విషయాలు వైఫ్ గుత్తా జ్వాల కూడా స్పందించింది. సమంత తీరుపై ఆమె కాస్త కోపానికి వచ్చింది.
జనానికి హెల్త్ టిప్స్ అందిస్తున్న సెలబ్రిటీలకు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ చికిత్స విధానం అవతల వారికి ఉపయోగపడాలి కానీ, చనిపోయే పరిస్థితులు రాకూడదు , ఎదుటివారికి మంచి చేయాలనే నీ ఆలోచన బాగానే ఉంది కానీ, వాళ్లకు జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ సలహా ఇచ్చింది. నీకు సలహా ఇచ్చిన డాక్టర్ బాధ్యతగా ఉంటారు అంటే అలాంటి మెసేజ్ లు పెట్టండి లేదంటే లేదు అంటూ గుత్తా జ్వాల ట్విట్టర్ వేదికగా సమంతాను ప్రశ్నించింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.