Movie Tree: సినిమా చెట్టు కూలడంతో గ్రామస్తుల కన్నీరు.! 

సినిమా రంగంలో నటినటులు, దర్శకనిర్మాతలు,  హీరో హీరోయిన్ల అంద చెందాలతో పాటుగా  కాస్త సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలా వందలాది సినిమాలకు సెంటిమెంట్ గా  వస్తోంది ఈ చెట్టు. ప్రతి చిత్రంలో


Published Aug 05, 2024 04:59:02 PM
postImages/2024-08-05/1722857342_movietree.jpg

న్యూస్ లైన్ డెస్క్: సినిమా రంగంలో నటినటులు, దర్శకనిర్మాతలు,  హీరో హీరోయిన్ల అంద చెందాలతో పాటుగా  కాస్త సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలా వందలాది సినిమాలకు సెంటిమెంట్ గా  వస్తోంది ఈ చెట్టు. ప్రతి చిత్రంలో ఏదో ఒక చిన్న సీన్ అయినా ఈ చెట్టు దగ్గర షూటింగ్ చేస్తే సినిమా 100 రోజులు ఆడడం పక్కా అని  భావిస్తారు.  అలాంటి ఈ సినిమా చెట్టు కూలిపోవడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడ ఉంది వివరాలు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో  ఈ సినిమా చెట్టు ఉంది. ఈ చెట్టు వయసు దాదాపుగా 140 నుంచి 150 సంవత్సరాలు ఉంటుందట. ఈ చెట్టు కింద ఇప్పటికే 300 కు పైగా సినిమాలు షూటింగ్ జరిపారట.  1975 లో రిలీజ్ అయిన పాడి పంటల నుంచి మొదలు  రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజరు వరకు  ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్నాయట.

 ఇందులో మూగమనసులు, పద్మ వ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు, వంటి ఎన్నో చిత్రాలు ఈ చెట్టు కింద షూటింగ్ చేశారట. అంతేకాకుండా డైరెక్టర్ కె విశ్వనాథ్, జంధ్యాల,  రాఘవేంద్రరావులకు ఈ సినిమా చెట్టు  ఎంతో కలిసి వచ్చిందని, వారి ప్రతి సినిమాలో ఈ చెట్టు కింద తప్పక షూటింగ్ ఉంటుందని  గ్రామస్తులు అంటున్నారు. అంతేకాకుండా దర్శకుడు వంశీ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ చెట్టు కింద భోజనం చేసేవారట.

అంతేకాదు ఈ సినిమా చెట్టు వల్లే ఆ గ్రామానికి అంతలా పేరు వచ్చిందని ఆ గ్రామస్తులు అంటున్నారు. అలాంటి ఈ చెట్టు సడన్ గా కూలిపోవడంతో  గ్రామంలోని వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ చెట్టు వల్లే మా గ్రామానికి మంచి పేరు వచ్చిందని, అలాంటి ఈ చెట్టు కూలిపోవడం మాకు తీరని నష్టమని ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ చెట్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://x.com/bigtvtelugu/status/1820393166614544459

newsline-whatsapp-channel
Tags : newslinetelugu game-changer raghavendrarao east-godavari k.vishwanath movie-tree

Related Articles