పవర్ స్టార్ కు ఇష్టమైన తెలుగింటి భోజనం ఇదేనట.!

లుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన కేవలం సినిమాల్లోనే ఫేమస్ అవ్వడమే  కాకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అలాంటి


Published Sep 15, 2024 06:25:02 PM
postImages/2024-09-15/1726404902_pawankalyan.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన కేవలం సినిమాల్లోనే ఫేమస్ అవ్వడమే  కాకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అలాంటి పవర్ స్టార్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ స్థాయిలో కూడా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. అలాంటి ఈయన గురించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చిన ఆయన అభిమానులకు తెలుసుకోవాలనే ఆత్రుత ఎంతో ఉంటుంది.

ఈ విధంగా సినిమాల్లో మరియు  రాజకీయాల్లో సక్సెస్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  జనసేన పార్టీ స్థాపించి దానిని ఓ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు పడ్డారు. అయినా అన్ని భరించి కసితో తను అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్లి ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్ గా మారారని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ కష్టానికి తన పార్టీ నిలబడడమే కాకుండా ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కూడా  బాధ్యతలు చేపట్టే అవకాశం పొందాడు.

 ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఓ స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలు బయట పెట్టాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని  యాంకర్ ప్రశ్నించగా నాకు ఆంధ్ర స్టైల్ లో పులావ్ చేస్తే చాలా ఇష్టంగా తింటానాని చెప్పుకొచ్చారు. తనకు ఎప్పుడైనా తినాలనిపిస్తే తప్పకుండా అమ్మ చేత ఈ ఫుడ్ చేయించుకుని తింటానని అన్నారు.

newsline-whatsapp-channel
Tags : pawankalyan chiranjeevi janasena tdp news-line nagababu pulav

Related Articles