Panchangam Today: రేపు అమావాస్య..ఈ రోజు అమృత గడియలు ఇవే ..!


 03 ఆగస్టు 2024 శనివారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, ఆషాడ మాసం, బహుళపక్షం.


Published Aug 03, 2024 08:52:48 AM
postImages/2024-08-03//1722655368_today.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఎదురు అమావాస్యతో పనులు చేయకూడదు. పెద్ద పెద్ద పనులు , ప్రయాణాలు చేయకూడదు..కాని చిన్న చిన్న పనులు ..తప్పక చెయ్యాల్సిన పనులు బోలెడు ఉంటాయి. అవసరం వస్తే అమావాస్య రోజు కూడా చెయ్యాల్సిందే. అయితే ఈ రోజు కొన్ని మంచి గడియలున్నాయి . అవసరమనుకున్న పనులు ఈ గడియల్లో చేసుకోవచ్చు.


 03 ఆగస్టు 2024 శనివారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, ఆషాడ మాసం, బహుళపక్షం.


ఇవాళ 5 గంటల 45 నిమిషాలకు సూర్యోదయం.


ఈ రోజు సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకి సూర్యాస్తమయం


 తిథి: బహుళ చదుర్దశి సాయంత్రం 03 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత అమావాస్య.


నక్షత్రం: పునర్వసు, మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉంటుంది. తర్వాత: పుష్యమి


యోగం: వజ్ర మధ్యాహ్నం 11 గంటల 02 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత సిద్ది


*అమృతకాలం ఉదయం 09 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు.మీరు ఏదైనా పని ప్రారంభించాలంటే ఈ ర10 నుంచి 11 లోపు చేసేసుకుంటే మంచిది.


*దుర్ముహూర్తం ఉదయం 06 గంటల నుంచి 07 గంటల 42 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. 


రాహుకాలం ఉదయం 09 గంట 30 నిమిషాల నుంచి 10 వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. 


యమ గండకాలం మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉంది. 


వర్జ్యం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi

Related Articles