Devara: రెండో సాంగ్ పై ట్రోల్స్..దాని నుంచి కాపీ కొట్టారంటూ.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నటువంటి పాట దేవర సినిమా నుంచి వచ్చిన సాంగ్. ఎన్టీఆర్ హీరోగా జాన్వీకపూర్ హీరోయిన్ గా వచ్చినటువంటి ఈ చిత్రం రెండవ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.


Published Aug 06, 2024 09:18:52 AM
postImages/2024-08-06/1722919473_Devarasecondsomg.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నటువంటి పాట దేవర సినిమా నుంచి వచ్చిన సాంగ్. ఎన్టీఆర్ హీరోగా జాన్వీకపూర్ హీరోయిన్ గా వచ్చినటువంటి ఈ చిత్రం రెండవ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇదే తరుణంలో ఈ సాంగ్ పై విపరీతమైనటువంటి ట్రోల్ కూడా నడుస్తోంది. ఈ పాటను  మరో పాటతో కాపీ కొట్టారని  దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 దేవర నుంచి రిలీజ్ అయినటువంటి రెండవ సాంగు "చుట్టమల్లె అంటూ సాగుతుంది. ఈ రెండవ పాట ఫుల్ రొమాంటిక్ అండ్ మెలోడీయన్ గా సాగుతుంది. ఈ పాటలో జాన్వి, ఎన్టీఆర్  కాంబినేషన్ అద్భుతంగా కుదిరినట్టే కనిపిస్తోంది. చూస్తే మనసును ఆకట్టుకునే విధంగా ఉంది. అలాంటి ఈ సాంగ్ పై  కొంతమంది ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్  దీన్ని కాపీ కొట్టారు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టేసారు.

అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన శ్రీలంక  సాంగ్  "మానికే  మాగే హితే" అనే పాట   నుంచి దీన్ని కాపీ కొట్టి అనిరుద్ ఈ సాంగును కంపోజ్ చేశాడని ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. దేవరా సాంగ్ తో  శ్రీలంక  సాంగ్  జత చేసి  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ లిరికల్ వీడియోలో జాన్వి కపూర్ అందాలను చూడటానికి రెండు కాళ్లు సరిపోవు.

దివి నుంచి దిగివచ్చిన దేవకన్యల  అద్భుతమైన లుక్ లో కనిపిస్తోంది. ఎన్టీఆర్ ను వీరలెవల్లో చూపించారు కొరటాల శివ. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే కోట్లాది వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగే ఇంత పాపులారిటీ పొందితే సినిమా రిలీజ్ అయ్యాక ఎంతటి ఆదరణ పొందుతుందో ముందు ముందు తెలుస్తుంది.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara janhvi-kapoor devara-second-song chuttamalle-song srilanka-song

Related Articles