దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగష్టు 15న జరిగిన సంబరాల్లో గాంధీ పాల్గొనలేదనే విషయం మీకు తెలుసా? అసలు ఆరోజు గాంధీజీ ఎక్కడున్నారు?
న్యూస్ లైన్ డెస్క్ : భారత దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఎందరో వీరులు పోరాటం చేశారు. ప్రాణాలు అర్పించారు. బ్రిటీష్ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చివరికి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. అయితే.. వారిలో ఎక్కువగా వినిపించే పేరు మాత్రం మహాత్మ గాంధీదే. అయితే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగష్టు 15న జరిగిన సంబరాల్లో గాంధీ పాల్గొనలేదనే విషయం మీకు తెలుసా? అసలు ఆరోజు గాంధీజీ ఎక్కడున్నారు?
- దేశానికి స్వాతంత్ర్య వచ్చిన రరోజు గాంధీజీ ఢిల్లీకి వేల కి.మీ దూరంలో ఉనన బెంగాల్ లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ హిందూ, ముస్లింల మత ఘర్షణలు అడ్డుకోవడానికి వెళ్లారు.
- బ్రిటీష్ వారు దేశానికి ఫ్రీడమ్ ప్రకటించిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ చారిత్రక ప్రసంగమైన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ని గాంధీజీ వినలేదు. ప్రస్తుత రాష్ట్రపతి భవన్ నుంచి మాట్లాడిన నెహ్రూ స్పీచ్ ను ప్రపంచమంతా విన్నప్పటికీ గాంధీజీ మాత్రం వినలేదు. ఆరోజు రాత్రి 9 గంటలకే నిద్రపోయారని ఆయన సహాయకులు చెప్పారు. అయితే.. అప్పటికింకా నెహ్రూ దేశానికి ప్రధాని కాలేదు.
- ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారత ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేయడం మనకు తెలిసిందే. అయితే.. 1947 ఆగష్టు 15న మాత్రం అలా జరగలేదు. ఎర్రకోట మీద 1947 ఆగష్టు 16న నెహ్రూ జాతీయ పతాకం ఎగుర వేశారు. ఇది లోక్ సభ సెక్రటేరియట్ లోని పత్రాల్లో రికార్డయింది.
- అప్పటి భారత వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్ బెల్ జాన్సన్ రికార్డు చేసిన వివరాల ప్రకారం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి కారణం వేరే ఉంది. అప్పటి యుద్ధంలో జపాన్ మిత్రదేశాల సైన్యాల ముందు లొంగిపోయి 1947 ఆగష్టు 15 నాటికి రెండేళ్లైన సందర్భంగా ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటిష్ పాలకులు నిర్ణయం తీసుకున్నారట.
- భారత్ కంటే ఒకరోజు ముందే పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన విషయం తెలిసిందే. అయితే.. రెండు దేశాల మధ్య ఆగష్టు 15 వరకు సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. ఆగష్టు 17న ఇరు దేశాల మధ్య సరిహద్దు నిర్ణయించి దానికి రాడ్ క్లిఫ్ లైన్ గా ప్రకటించారు.
- 1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. అప్పటి వరకు మన జాతీయ గీతం ఏది అనేది ఫైనల్ కాలేదు. 1950లో జనగణమణను అధికారికంగా ప్రకటించారు. అయితే.. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని జనగణమణను 1911 లోనే రాశారు.
- ఆగష్టు 15 తారీఖు నాడు ఇండియాతో పాటు.. మూడు దేశాలు సైతం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణ కొరియా ఆగష్టు 15న, బహ్రెయిన్ 1971 ఆగష్టు 15న, కాంగో 1960 ఆగష్టు 15న స్వాతంత్ర్యం పొందాయి.