ఘటన జరిగి వారం రోజులైనా సోషల్ మీడియాలో చూసేవరకు నిజంగా తమకు కూడా తెలియదని అన్నారు. సుంకిశాల ఘటన వల్ల జరిగిన నష్టం చాలా తక్కువని.. అక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయం డెడ్‌స్టోరేజీ నుండి కృష్ణాజలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల వద్ద రిటెయినింగ్ వాల్ కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే భారీ ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. దీని కారణంగా భారీగా నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా, ఈ అంశంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సుంకిశాల ఘటన అనేది చాలా చిన్నదని ఆయన అన్నారు. సుంకిశాల ఘటన విషయంలో అతి చేయడం సరికాదని.. ఇది చాలా చిన్న ఘటన మాత్రమే అని ఆయన అన్నారు. ఘటన జరిగి వారం రోజులైనా సోషల్ మీడియాలో చూసేవరకు నిజంగా తమకు కూడా తెలియదని అన్నారు. సుంకిశాల ఘటన వల్ల జరిగిన నష్టం చాలా తక్కువని.. అక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదని తెలిపారు.
కొన్ని నెలలు ఆలస్యమైనా.. జరిగిన నష్టం అంతా కాంట్రాక్టర్ కంపెనీనే భరిస్తుందని వెల్లడించారు. రిటెయినింగ్ వాల్ కూలిపోవడం బాధాకరమే.. కానీ, దీనివల్ల ఏదో జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారని ఉత్తమ్ కుమార్ అన్నారు.