నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వహకుడు నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేసింది. జూలై 10న వీరి పెళ్లి అంగరం వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ..వెల్ విషర్స్ తో తన పెళ్లిని సింపుల్ గా చేసేసుకుంది .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వహకుడు నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేసింది. జూలై 10న వీరి పెళ్లి అంగరం వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ..వెల్ విషర్స్ తో తన పెళ్లిని సింపుల్ గా చేసేసుకుంది .
ఈ పెళ్లి ఫోటోల్లో వరలక్ష్మి ఎరుపు రంగు చీర, ఒంటినిండ ఆభరణాలతో మెరిసిపోగా.. సచ్‌దేవ్ క్రిం కలర్ పంచకట్టులో కనిపించాడు. సంప్రదాయ బద్ధంగా జరిగిన వీరిపెళ్లిలో థాయ్‌లాండ్‌కు చెందిన వీరి సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఎంగేజ్ మెంట్ కు పిక్స్ షేర్ చేస్తే తెగ ట్రోల్ చేశారు. దీంతో ఈ పెళ్లి పిక్స్ ను వరలక్ష్మి కాని ...శరత్ కుమార్ కాని షేర్ చెయ్యలేదు.
నికోలాయ్ కు ముందే పెళ్లయ్యింది. కవిత అనే మోడల్ ను పెళ్లి చేసుకొని.. వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇక విడాకులు అనంతరం ఒంటరిగా ఉంటున్న నికోలాయ్ వరలక్ష్మితో ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వరలక్ష్మీ ఇఫ్పుడు తెలుగు లేడీ విలన్స్ లో ఫస్ట్ ఆప్షన్ . తెలుగులో 'తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ' సినిమాతో లేడీ విలన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జాంబి రెడ్డి', 'నాంది', 'యశోద', 'వీరసింహా రెడ్డి' వంటి సినిమాల్లోనూ విలన్‌గా నటించి తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. హనుమాన్ లాంటి హిట్ తర్వాత నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చెయ్యలేదు వరలక్ష్మీ.